యాచారం, నవంబర్18: బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. కిషన్‌రెడ్డి రోడ్‌షో ఆయా గ్రామాలలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున పటకాలు పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ర్టాభివృద్ధి శూన్యమన్నారు. ఓడిపోతామనే భయంతో రోజుకో కొత్తరకం మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఓట్ల కోసం ముందుకొస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రూపొందిచినట్లు ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక రకాల పరిశ్రమలు తీసుకొచ్చి వందలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గున్గల్ రోడ్డను డబుల్ రోడ్డుగా మార్చడంతో ప్రయాణికుల కష్టాలు తీరాయన్నారు.
గడ్డమల్లయ్యగూడ గ్రామం చిన్న గూడెం అయినప్పటికీ అభివృద్ధిలో ఆదర్శంగా ఉందన్నారు. ఇప్పటికే గ్రామానికి జాతీయ అవార్డు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మేన్ రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, సర్పంచ్ ఇందిర, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, మహ్మద్ ఖాజు, యాదయ్యగౌడ్, అచ్చన రమేశ్, భీం యాదవ్, అచ్చన దానయ్య తదితరులు పాల్గొన్నారు.
మంచాల : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మంచాల మండల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న కిషన్‌రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామంటూ ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆగపల్లి, కాగజ్‌ఘట్, జాపాల, చాంద్‌ఖాన్ గూడ, అస్మత్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం చీకటి అవుతుందని, మళ్లీ పాతరోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ నాయకులు హరిప్రసాద్, గంట భిక్షపతి, నాగరాజు, రాంరెడ్డి, సంజీవ, పుట్ట సత్యం, గణేశ్, మాదం నరేందర్ పాల్గొన్నారు.
అత్యధిక మెజార్టీతో
తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాలన కొనసాగించరని, ప్రజలు మరోమారు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోడలు మౌనికారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి మునగనూర్‌లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత, వేముల స్వాతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పెద్దఅంబర్‌పేటలో కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేశారం బాలకృష్ణగౌడ్, చెరుకూరి జగన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపుతోనే మరింత అభివృద్ధి సాధ్యమని వివరించారు. పలు కాలనీల్లో బీఆర్ఎస్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు కంచర్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. మర్రిపల్లి, ఆర్కేనగర్లో కౌన్సిలర్ పాశం అర్చన ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.
తట్టిఅన్నారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తుర్కయంజాల్ :నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపు ఖాయమని రైతుబంధు సమితి అబ్దుల్లాపూర్‌మెట్ మండల కో ఆర్డినేటర్ కందాళ బలదేవరెడ్డి అన్నారు. కొహెడలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కొహెడ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.