న్యూఢిల్లీ, మే 27: హ్యుందాయ్ సంస్థ కూడా కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.12, 800 వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతోపాటు రూపాయి పతనం చెందడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.
గత నెలలోనే ఒక్క శాతం వరకు సవరించిన సంస్థ మళ్లీ వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చేలా ఆయా మాడళ్ళను బట్టి రూ.12,800 వరకు సవరించింది. ఉత్పత్తి వ్యయం అధికం కావడం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పుంజుకోవడం, నిర్వహణ ఖర్చులు పెరుగడం వల్లనే ధరలు సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.