వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణుల సన్నాహాలు
దిశానిర్ధేశం చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో సుమారు రూ.218.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించేందుకు రానున్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు కార్యక్రమాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ 22వ వార్డుల్లో జలమండలి నిధులు రూ.92 కోట్లతో పైపులైన్, ట్యాంకుల నిర్మాణం, రూ.6 కోట్లతో ట్రంక్‌లైన్ నిర్మాణ పనులు, సర్వే నెంబర్ 212లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు, రాగన్నగూడలోని లక్ష్మీమెగా టౌన్షిప్లో రూ.5.13 కోట్లతో అభివృద్ధి పనులు, సర్వే నెంబర్ 279లో రూ.3 కోట్లతో మున్సిపల్ భవన నిర్మాణ పనులు, రూ.2.20 కోట్లతో మాసాబ్ చెరువు పై సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆయా మున్సిపాలిటీల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.
గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కదలాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్, సబితారెడ్డి పర్యటన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదలాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండల స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఇబ్రహీంపట్నంలోని వైష్ణవిగార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుంచి ప్రజలను భారీగా తరలించేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు బాధ్య త తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీపీ కృపేశ్, వైస్‌ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజిరెడ్డి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్ అన్నారు. పార్టీ మండల కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో రైతు సహకార సంఘం చైర్మన్ విఠల్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, ఉపాధ్యక్షుడు రాజారాంచారి, సర్పంచ్ కిరణ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్వై నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు విజయ్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ పన్నీరు రాజేశ్, బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాండు, నాయకులు దేవేందర్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, ఉమాకాంత్చారి తదితరులు పాల్గొన్నారు.