మంత్రి కేటీఆర్ రోడ్ షో సక్సెస్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజ కవర్గంలోని కులకచర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రోడ్ షో సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందింది.
- బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం
పరిగి, నవంబర్ 13: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజ కవర్గంలోని కులకచర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రోడ్ షో సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందింది. కులకచర్లలో కేటీఆర్ రోడ్‌షో సోమవారం మధ్యా హ్నం మూడు గంటలకు ఉంటుందని పేర్కొనగా ఒంటి గంట నుంచే రోడ్‌షో ప్రాంతానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం ప్రారంభమైంది. పరిగి ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్, మహ్మదాబాద్, గండీడ్ మండలాల నుంచి భారీ జన సమీ కరణ చేపట్టారు. ప్రతి గ్రామం, గిరిజన తండాల నుంచి పెద్ద సంఖ్యలో కేటీఆర్ రోడ్‌షోకు జనం తరలివచ్చారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో రోడ్ షోకు హాజరవడం గమనార్హం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రసంగంలో పలు అంశాలపై మాట్లాడినపుడు సభికుల నుంచి చక్కటి స్పందన కనిపించింది. ఒక దశలో సీఎం, సీఎం అంటూ నినా దాలు చేయగా సీఎం ఖమ్మంలో ఉన్నారంటూ కేటీఆర్ చెప్పారు. రోడ్‌షో సందర్భంగా కులకచర్ల పెద్ద గేటు చౌరస్తా జన సంద్రంగా మారింది. ఈ సందర్భంగా పరిగి కాంగ్రెస్ నాయకుడిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి మద్దతు లభించింది. మరోవైపు రోడ్‌షో సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన మొదటి నాయకుడని చెప్పడంతో హర్షధ్వానాలు చేశారు. ఈసారి మహేశ్ రెడ్డిని గెలిపించండి గండీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపి స్తానని చెప్పడంతో ఈ రెండు మండలాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి మరింత మైలేజ్ రానుందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే సంవత్సరం లోపు కృష్ణా నీటిని తీసుకువచ్చి బీడు భూములు తడుపుతామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో రైతాంగంలో చక్కటి స్పందన వచ్చింది. ఏదిఏమైనా కేటీఆర్ రోడ్‌షోతో పరిగి బీఆర్ఎస్కు మరింత ఊపు వచ్చిందని పేర్కొనవచ్చు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

