గనుల లీజు.. ఆదాయం రెట్టింపు
రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని భూగర్భంలో గుట్టలు, రాళ్లల్లో పలు రకాల ఖనిజ ధాతువులు ఉన్నట్టు జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం చెబుతున్నది.
- 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.97.93 కోట్ల ఆర్జన
- 2022-23లో రూ.155.8 కోట్ల రాబడి
- సమాజ అవసరాలకు అనుగుణంగా ఖనిజ సంపద దోహదం
- ప్రధానమంత్రి క్షేత్ర యోజన పథకం ద్వారా రంగారెడ్డి జిల్లా ఖనిజ
నిధికి అదనంగా సమకూరిన ఆదాయం రూ.105.25 కోట్లు
రంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని భూగర్భంలో గుట్టలు, రాళ్లల్లో పలు రకాల ఖనిజ ధాతువులు ఉన్నట్టు జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం చెబుతున్నది. పెరుగుతున్న సమాజ అవసరాలకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. భూమిలో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను వెలికితీసి సమాజ అభివృద్ధికి, నిరుద్యోగ నిర్మూలనకు దోహదపడేలా జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం తోడ్పాటును అందిస్తున్నది.
ఖనిజ పరిశ్రమల ఏర్పాటుకు, ఖనిజ సంపదను సక్రమ పద్ధతిలో వెలికి తీసేందుకు కౌలుకు ఇవ్వడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, కౌలుదారుల నియంత్రణ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన సూచనలు ఇవ్వడం జిల్లా గనులు, భూగర్భ అధికార విభాగం యొక్క ప్రధాన విధి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు గనులు, ఖనిజ వనరుల వినియోగం అత్యంత లాభదాయకంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మైన్స్ & జియాలాజీ విభాగం సాంకేతిక అంశాలను చూసుకుంటున్నది. హెచ్జీఎస్ 1951 నుంచి ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’లో విలీనం అయ్యింది. దీంతో పాటే ఖనిజ రాయితీలు ఇచ్చే విధులు రెవెన్యూ శాఖకు బదిలీ చేయబడ్డాయి.
జిల్లావ్యాప్తంగా పలుచోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు
రాష్ట్రంలోనూ, జిల్లావ్యాప్తంగా మైన్స్ – జియాలజీ విభాగం గనులు – ఖనిజాలకు సంబంధించిన సాంకేతిక అంశాలను చూసుకుంటున్నది. ఖనిజ రాయితీలను మంజూరు చేసేలా ఈ విభాగం ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. అప్పటి నుంచి ఖనిజ కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఆధ్వర్యంలో మైన్స్ – జియాలజీ, సహాయ సంచాలకులు (అసిస్టెంట్ డైరెక్టర్) చూసుకుంటున్నారు. గనుల లీజు, పర్మిట్ వ్యవస్థను ప్రవేశ పెట్టడం, గని యజమానుల నుంచి ముందుగానే రాయల్టీ చెల్లించడం, లీజుకు తీసుకున్న ప్రాంతాల నుంచి ఖనిజాలను రవాణా చేయడానికి ముందు గనులు, భూగర్భ శాస్త్ర అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతులు పొందడం తప్పనిసరి. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ప్రధానంగా పలు చోట్ల గనులు, ఖనిజాలు అమితంగా ఉన్నాయి. ఇంకా కందుకూరు, అబ్దుల్లాపూర్‌మెట్, తలకొండపల్లి, కడ్తాల్ తదితర ప్రాంతాల్లో గనులు, ఖనిజాలు, క్వారీలు ఉన్నట్టు సమాచారం. వీటి వినియోగం, లీజుల ద్వారా జిల్లాకు కోట్లల్లో ఆదాయం సమకూరుతున్నది. సమాజ అభివృద్ధికి అవసరమైన విధంగా గనులు, ఖనిజాలు, క్వారీలు నేడు ఎంతగానో వినియోగంలో ఉన్నాయి. ఖనిజ నిక్షేపాలున్న క్షేత్రాలు, క్వారీలను ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు కౌలు, లీజులకు ఇస్తున్నది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు గనులు, ఖనిజ వనరుల వినియోగం అత్యంత లాభదాయకంగా ఉన్నది.
జిల్లాలోని ఖనిజాలు – కౌలు వివరాలు
రాయి, కంకర 80 మందికి., గ్రానైట్ 15., పలుగురాయి, పెల్డ్స్ పార్ 51., లేటరైట్ 3., మొత్తం 149 మందికి కౌలుకిచ్చారు. గనుల లీజు ద్వారా కోట్లల్లో ఆదాయం జిల్లాలో ఉన్న గనులు, క్వారీలపై పెత్తనం అంతా జిల్లా అధికారులదే. గనులు, క్వారీ స్థలాలను గురించి, పరీక్షించడం, కౌలు మంజూరుకు సిఫారసు చేయడం అంతా సహాయ సంచాలకుల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. కౌలుకు మంజూరైన స్థలాలను సక్రమంగా కౌలు నిర్వహించేలా తనిఖీ చేయడం, ఖనిజ ఆదాయమును ఎప్పటికప్పుడు మదింపు చేసి, ప్రభుత్వ ఆదాయమును పెంచేలా చూడటం, ఖనిజాల ఆధారంగా ఏర్పడిన పరిశ్రమల పట్ల తనిఖీలు నిర్వహించి తగు సూచనలు చేసున్నది.
చట్ట విరుద్ధంగా పని చేసే క్వారీలు, గనులు, అక్రమ ఖనిజ రవాణాను నివారించి, దానిపై అపరాధ రుసుము వసూలు చేయుట మొదలైన విధులను జిల్లా సహాయ సంచాలకులు నిబద్ధతతో నిర్వర్తిస్తుంటారు. ఇట్లా గనులు, ఖనిజాల రూపేణా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.97.93 కోట్ల ఆదాయాన్ని ఈ విభాగం సాధించింది. 2022-23లొ రూ.155.8 కోట్ల రాబడిని రాబట్టగలిగింది. ప్రధానమంత్రి క్షేత్ర యోజన పథకం ద్వారా అదనంగా జిల్లా ఖనిజ నిధికి అదనంగా రూ.105.25 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే మైనింగ్ విభాగంలో ఆదాయం రెండింతలు పెరిగింది.
గతంతో పోల్చుకుంటే.. రెవెన్యూ రెట్టింపు అయ్యింది
– ప్రవీణ్‌రెడ్డి, సహాయ సంచాలకులు, జిల్లా గనులు, భూగర్భశాఖ
గత యేడాదితో పోల్చుకుంటే మైనింగ్ విభాగం ద్వారా జిల్లాకు ఆదాయం రెట్టింపు అయ్యింది. లోకల్ డెవలప్మెంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రాయల్టీ విధానం ద్వారా, ప్రధాని ఖనిజ క్షేత్ర యోజన ద్వారా సప్లిమెంటరీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. జిల్లాలో మొత్తం 149 మైనింగ్ క్షేత్రాలు ఉండగా, 105 మాత్రమే ప్రధానంగా పని చేస్తున్నాయి. వాటి ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. మిగతా కేంద్రాలు అప్పడప్పుడు పని చేస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి రెవెన్యూ బాగా వచ్చింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

