గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తే కేసులా?
వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్‌కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మర్పల్లి మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు, సర్పంచ్‌లతో కలిసి ఆయన మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ దీపక్తివారీని కలిసి సమస్యలు విన్నవించారు.
- పల్లెల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్
- బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించడంలేదు
- బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపణ
- రైతులు, సర్పంచ్‌లతో కలిసి కలెక్టర్‌ను కలిసి సమస్యలు వివరించిన మాజీ ఎమ్మెల్యే
వికారాబాద్, జూన్ 16 : వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్‌కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మర్పల్లి మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు, సర్పంచ్‌లతో కలిసి ఆయన మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ దీపక్తివారీని కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లిలో ఇటీవల సీసీ రోడ్డు వేశారని.. రోడ్డు ఎత్తుగా ఉండడంతో దానిని ఎక్కేందుకు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందిపడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులందరూ సమావేశమై రోడ్డు పక్కన మట్టి పోయాలని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులు, పంచాయతీకార్యదర్శి, ప్రజలతో కలిసి తీర్మానం చేయించి.. జేసీబీ, ట్రాక్టర్లతో మట్టి ని పోస్తుంటే.. పోలీసులు ఆ వాహనాలను పట్టుకుని వాటికి రూ. 20వేల నుంచి 30వేల జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశా రు. అదేవిధంగా గ్రామం నుంచి రైతుల పొలాలకు వెళ్లే నష్టబాట సక్రమంగా లేకపోవడంతో దానిని మట్టిపోసి పూడ్చేందుకు రైతులు యత్నిస్తుండగా ఇరిగేషన్ అధికారులు వారికి ఫోన్ చేసి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రం నుంచి కానీ.. స్పీకర్ సొంత నిధులు కానీ.. పై గ్రామాలకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
సిరిపురంలో గత కేసీఆర్ హయాంలో రూ.19.50 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తే ఇప్పటివరకు ఆ పనులకు ప్రారంభోత్సవమే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకాసురులు ఆయా గ్రామాల్లోని గుట్టలను మాయం చేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తే ఏ ఒక్క అధికారి, పోలీసులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తే అడ్డుకోవడం, కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. పలు గ్రామాలకు మంజూరైన పనులను కూడా రద్దు చేయడం జరిగిందని దీనికంతటికి కారణం స్పీకర్ కుట్రలే అని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు, భవనాలు మంజూరు చేయకుండా అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడే బీఆర్ఎస్ నాయకులు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

