Bike accident | ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్న అతివేగం.. అలియాబాద్‌లో అర్ధరాత్రి ఘటన
అతివేగం ఇద్దరు వలసకూలీల ప్రాణాలను బలికొంది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జినోమ్ వాలీ పోలీస్ స్టేషన్ పరిధి అలియాబాద్ లో అర్ధరాత్రి చోటుచేసుకుంది.
శామీర్ పేట్, అక్టోబర్ 19 : అతివేగం ఇద్దరు వలసకూలీల ప్రాణాలను బలికొంది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జినోమ్ వాలీ పోలీస్ స్టేషన్ పరిధి అలియాబాద్ లో అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ కు చెందిన కాస్మోస్ మార్కి (22) అలియాబాద్ లో నివాసం ఉంటున్నాడు. సుమిత్ కుళ్లు (23) బాలానగర్ లో ఉంటూ ఈ ఇద్దరు అలియాబాద్ మునిసిపల్ పరిధిలోని డైనమిక్ కంపెనీలో పనిచేస్తున్నారు.
కంపెనీ దసరా దావత్ కు వెళ్లి తిరిగి ఆదివారం అర్ధరాత్రి బైక్ పై అలియాబాద్ లోని రూమ్ కి వస్తున్నారు. మార్గ మధ్యలో అలియాబాద్ బ్రింద రెడ్డి కన్వీన్షన్ ముందు అతివేగంగా వస్తున్న వీరి బైక్ చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువయ్య గౌడ్ తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

