అభివృద్ధేకే పట్టం కట్టిన పట్టభద్రులు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం
పటాకులు కాల్చి.. సంబురాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
దుండిగల్, మార్చి 20 : హైదరాబాద్, రంగారెడ్డి, మ హబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించడంపై శనివారం టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ నాయకుడు కొలన్ గోపాల్‌రెడ్డి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అభివృద్ధికే పట్టభద్రులు మరొక్క సారి పట్టం కట్టారన్నారు. ప్రజల మద్దతు, ముఖ్యంగా విద్యావంతుల మద్దతు టీఆర్ఎస్కే ఉన్నదని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైందన్నారు.
దుండిగల్ మున్సిపల్లో..
దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభీపూర్కృష్ణ ఆధ్వర్యంలో పలువురు నిజాంపేట కార్పొరేటర్లు, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు తెలంగాణ భవన్‌కు తరలివెళ్లి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

