మొక్కలు నాటి..చెత్తను నిర్మూలించి..!

- బహిర్గత చెత్తకు చెక్ పెట్టేందుకు వినూత్న ప్రయోగం
- ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు చర్యలు
- కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారుల అవగాహన
కుత్బుల్లాపూర్, మే9 : చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో నూతనంగా మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా చెత్తను ప్రజలు విచ్చలవిడిగా వేసే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ పొడవాటి కర్రలను ఏర్పాటు చేసి, మినీగార్డెన్ మాదిరిగా మొక్కలు నాటుతున్నారు. శనివారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్ కాలనీకి వెళ్లే మార్గం గుండా ప్రధాన ఓపెన్ నాలాకు ఆనుకొని ఉన్న ప్రాంతం లో నిత్యం ఎవరో ఒకరు చెత్తను వేసి వెళ్తున్నారు. గతం లో ఇలాంటి ప్రాంతాలను శుభ్రం చేసి చెత్త వేయొద్దంటూ ముగ్గులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినప్పటికీ ప్రజల్లో మార్పులు రాకపోవడంతో ఇప్పుడు కొత్తగా మొక్కలు నాటి అవగాహన కల్పిస్తున్నారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్రాం తాలు ఉంటాయో అక్కడ శుభ్రం చేసి టెంట్ వేసుకొని లాఠీ.. సిఠితో గతంలో కొన్ని రోజులు చెత్త వేయకుండా నేరుగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోల్లోనే వేసేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
చెత్తరహిత ప్రాంతాలుగా..
బహిర్గత చెత్తతో ప్రజలకు కలిగే ముప్పును నివారించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ‘మనం మారుదాం.. మన నగరాన్ని మార్చుకుందాం’ అనే నినాదంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నగరాన్ని దినదినం సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా చెత్తను బహిర్గత ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా చేయడం ద్వారా కుక్కలు, పందులతో స్వైరవిహారం చేసి అంధవికారంగా మారి అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఈ మేరకు గత కొంతకాలంగా బహిర్గత ప్రాంతాల్లో పూర్తిగా చెత్తడంప్ కుండీలను తొలగించి, వాటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పలు పద్ధతుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు మొక్కలు నాటి.. ఆ ప్రాంతాలను మినీ గార్డెన్లుగా మార్చేందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల్లో ఇంకా మార్పు రావాలి..
- చెత్తను విచ్చలవిడిగా బయట వేయకుండా ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటోల్లోనే వేసేలా అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.
- అయినా ఇప్పటికీ ప్రజల్లో పూర్తిస్థాయిలో మార్పులు రావడం లేదు.
- ఓపెన్ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలపై వచ్చి చెత్తను వేసి వెళ్తున్నారు.
- బహిర్గత ప్రాంతాల్లో చెత్తను వేయడం సరైంది కాదు.
- ప్రజలు ఇలాంటి వాటికి స్వస్తి పలికి మన నగరాన్ని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ముందుకు రావాలి. -భానుచందర్, ఏఎంహెచ్ఓ, కుత్బుల్లాపూర్ సర్కిల్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- quthbullapur circle
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

