నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఏండ్ల వృద్దురాలు అదృశ్యమైంది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం వాయిపురి, సైనిక్‌పురిలో నివాసం ఉంటున్న లచ్చవ్వ (80) ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అంతటా వెతికినా ఆచూకి దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.