కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

- నాగారంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్
- ప్రతి రోజూ 100మందికి రెండో డోస్ టీకా
మేడ్చల్ కలెక్టరేట్,మే 11: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ సూచించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వికాస్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డితో కలిసి అదనపు కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకొని 42రోజులు దాటిన వారు రెండో డోసు తీసుకునేందుకు అర్హులన్నారు. మొదటి డోసు ఎక్కడ తీసుకున్నప్పటికీ వారి ఆధార్, మొదటి డోసు రోజున నమోదు చేసుకున్న ఫోన్నంబర్తో సంప్రదించి రెండో డోసును ఎక్కడైన తీసుకోవచ్చన్నారు.
నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సెంటర్లో ప్రతి రోజూ 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారన్నారు. అనంతరం సెంటర్లో సదుపాయాలు కల్పించిన మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డిని అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్ రావు, మండల వైద్యాధికారి సరిత, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

