MLA Lakshma Reddy | ఉప్పల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
చర్లపల్లి, జూన్ 22 : ఉప్పల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడలో రూ.76లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, స్థానికులు, కాలనీవాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో డ్రైనేజీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని, కాలనీలలో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పనులను కాలనీవాసులు, నాయకులు పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా వెంకటేశ్, చక్రపాణిగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్ ముదిరాజ్, నందు, కృష్ణ, జయకృష్ణ, సంపత్, రాజులతో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

