కుత్బుల్లాపూర్,నవంబర్2 : యువత తమలోని శక్తిని తెలుసుకొని సమాజహితం కోసం ముందుకు రావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం ఉక్కు మనిషి సర్ధార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఐడీపీఎల్ చౌరస్తాలో 3కె రన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిధిగా హజరై పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళ్లుర్పించారు.
ఈ కార్యక్రమంలో జీడిమెట్ల సీఐ మల్లేశం, సాయి సిద్దార్థ ఆసుపత్రి ఎండీ కిరణ్గ్రంథి, ప్రముఖ వ్యాపారవేత్త మోహన్‌రావు, స్వామి వివేకానంద యూత్ అసోషియేషన్ అధ్యక్షులు జల్దా లక్ష్మినాథ్, సభ్యులు శ్రీకాంత్, మధుబాబు, తిమ్మయ్య, నవీన్, విజయ్, సత్యనారాయణ, శ్రీనివాస్, సందీప్, అల్లావుద్దీన్, సంతోష్‌బాబు, ఆనంద్, రమ్మిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.