హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) లీడ్లో కొనసాగుతున్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి 10,133 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మల్లారెడ్డికి 38,127 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 27,994, బీజేపీ అభ్యర్థికి 7519 ఓట్లు పోలయ్యాయి.