మహిళల రక్షణే యువకుడి లక్ష్యం

- మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ స్ఫూర్తి పథం
- ప్రతి రక్షణ శిక్షణతో సేవా పథం
- యువత ఉపాధికి కృషి
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 02 : తమతో కలిసి ఆడి, పా డి, ఆత్మీయురాలుగా ఉన్న వివాహిత లైంగిక వేధింపులతో మృతి చెందిన సంఘటన ఆ యువకుడిని మార్చింది. పు రుషాంహాకార సమాజంలో మహిళలు, బాలికలు బలిపశువులుగా మారకముందే తగిన శిక్షణతో తమను తాము రక్షించుకునే పరిస్థితులు తీసుకురావాలని సంకల్పించాడు. స్వతహాగా పాఠశాల స్థాయిలో ఎన్సీసీ శిక్షణ పొంది, తైక్వాండో, కిక్ బాక్సింగ్‌లో జాతీయస్థాయి ప్లేయరైనా అత డు సేవా చేయాలనే ధృక్పతంతో షీల్డ్ వ్యవస్థను నెలకోల్ప డు. సొంత డబ్బుతో బాలికలు, మహిళలకు ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాడు. రాంపల్లి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు శిక్షణ శిబిరాలను విస్తరించాడు.
శిక్షణకు భారీ నెట్ వర్క్..
- తన సోదరి అత్తింట్లో వేధింపులతో మృతి చెందడంతో రాంపల్లికి చెందిన సంతోశ్ కుమార్లో అంతర్మథనం మొదలైంది.
- మహిళలు, బాలికలు అన్యాయానికి గురికాకముందే వారంతట వారే తమను తాము రక్షించుకునే పరిస్థితులు వస్తే బాగుంటుందని భావించాడు.
- ఆ దిశగా ఆలోచన చేస్తూ పయనం మొదలు పెట్టాడు. షీల్డ్ అనే సంస్థను స్థాపించి, నెట్‌వర్క్‌ను విస్తరించాడు.
- ఎన్సీసీలో పని చేసిన తోటివారితో తన వద్ద మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన వారిని కూడగట్టాడు.
- అతడి గొప్ప ఆలోచనను నచ్చి, చాలా మంది షీల్డ్‌లో సభ్యులుగా చేరి సేవలందిస్తున్నారు.
- దాదాపు 1500మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్లంతా సంతోశ్ ఆధ్వర్యంలో మహిళలు, బా లికలు ఇచ్చే శిక్షణలో భాగస్వాములవుతున్నారు.
- ప్రభుత్వ పాఠశాలలు, గ్రామా లు, బాలికల ఉచిత వసతి గృహా లు, చిన్న చిన్న కంపెనీల్లోని మహిళలను ఒకచోట చేర్చి శిక్షణనిస్తున్నారు.
- చీర్యాల, బండ్లగూడ, బోడుప్పల్, సైనికుపురి, బోయిగూడ, యాప్రాల్, బాలాజీనగర్, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లోని కాలనీలు, కుటీర పరిశ్రమల్లోని మహిళలు, బాలికలకు శిక్షణనిచ్చారు. ఇలా 80కి పైగా శిబిరాలను నిర్వహించారు.
ఆన్లైన్ వేదికగా…
శిక్షణ పొందాలనుకునే వారు ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు వెళ్లి శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే అభ్యర్థనలను స్వీకరించి, ఉచితంగా శిక్షణనిస్తున్నారు. నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ఈ ప్రాంతమైనా కనీసం 30నుంచి 40మంది వరకు ఒక చోట చేరి శిక్షణను అభ్యర్థిస్తే శిక్షణనిస్తామని సంతోశ్ తెలిపారు.
యువతకు మార్గదర్శం..
మహిళా శిక్షణతో పాటు ఇంటర్, డిగ్రీ చదివి కంపెనీల్లో 10, 12గంటల పాటు శ్రమ ను ధారపోస్తూ తమ శక్తి, యుక్తులను నిర్వీర్యం చేసుకుంటున్న యువతకు మార్గదర్శం చేసేందుకు సంతోశ్ కృషి చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చి, శిక్షకులుగా మారుస్తున్నారు. ఈ శిక్షణతో తరగతులు నిర్వహిస్తూ అంతకు మించి సులభంగా సంపాదిస్తున్నారు. మిగితా సమయాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, వ్యక్తిగతంగా అభివృద్ధి చేసేందుకు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
సైకాలజికల్ ట్రైనింగ్
- మహిళలు, బాలికలకు ఇచ్చే ప్రతిఘటన శిక్షణ ఫిజికల్ ట్రైనింగ్ కాదు. ఇది పూర్తిగా సైకాలజికల్ శిక్షణ.
- వారిని సైకాలజికల్‌గా స్ట్రెంథెన్ చేసినప్పు డు తమను తాము రక్షించుకోగలుగుతారు.
- ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్న మానసికంగా సిద్ధంగా లేకుం టే తమను తాము రక్షించుకోలేరు.
- తాము మూ డు రోజుల పాటు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మా నసికంగా బలంగా మల్చడంపై ప్రధానంగా దృష్టి సారిస్తాం.
- తక్కువ సమయంలో తమను ఇబ్బంది పెట్టే వ్యక్తుల నుంచి సులభంగా రక్షించుకునే శిక్షణనిస్తాం.
- తమ వద్ద శిక్షణ పొందిన ఒక విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులోకి లాగే ప్రయత్నం చేస్తుండగా తనను తాను రక్షించుకుంది.
- ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి, కృతజ్ఞతలు తెలుపడం ఎంతో సంతృప్తినిచ్చింది.
- ఇలా ఒక బాలికను మాయమాటలతో మోసం చేసే ప్రయత్నిస్తున్న వ్యక్తి, అతడి స్నేహితులతో తన వద్ద శిక్షణ పొందిన వ్యక్తి ఫైట్ చేసి రక్షించాడు.
- భవిష్యత్‌లో షీల్డ్‌ను దేశం మొ త్తం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- ప్రతి పాఠశాలలో బాలికల సెల్ఫ్‌డిఫెన్స్ కోసం ప్రత్యేకం గా ఒక శిక్షకుడిని నియమించుకొని, ఒక సబ్జెక్టు టీచ్ చేసినట్టు చేయాలి. – సంతోశ్ కుమార్, షీల్డ్ వ్యవస్థాపకుడు
సేవతో పాటు డబ్బులు సంపాదిస్తున్నా..
డిగ్రీ చదువుకుని కంపెనీలో రూ. 10వేలకు పని చేస్తున్న నాకు సంతోశ్ పరిచయమయ్యారు. అతడి వద్ద శిక్షణ తీసుకున్న నేను ప్రస్తుతం సంస్థలో సేవ చేస్తున్నా. చాలా మందికి శిక్షణ ఇవ్వడంతో నేడు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు సంపాదిస్తున్నా. షీల్డ్‌లో పనిచేయడం సంతోషంగా ఉంది. – వెంకన్న, షీల్డ్ సభ్యులు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

