ఎర్లీబర్డ్ పథకంలో కాప్రా టాప్

గ్రేటర్‌లోనే మొదటి స్థానంలో..
రూ.10.20 కోట్ల ఆస్తిపన్ను చెల్లింపులు
నేడు ఒక్కరోజే అవకాశం
కాప్రా, ఏప్రిల్ 29: సర్కిల్లో ఎర్లీబర్డ్ ఆస్తిపన్ను చెల్లింపులు జోరుగా కొనసాగుతున్నాయి. 5శాతం రిబేటుతో ఇంటిపన్నులు చెల్లించే అవకాశాన్ని సాధారణ ప్రజలతో పాటు సర్కిల్ పరిధిలోని పలు పెద్ద సంస్థలు సైతం సద్వినియోగం చేసుకుంటున్నాయి. సర్కిల్ పరిధిలోని ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ వంటి బడా సంస్థలు భారీగా ఉండే ఆస్తిపన్నును చెల్లించి ఐదు శాతం రిబేటును పొంది లబ్ధిపొందుతున్నాయి. మరోవైపు సర్కిల్ రెవెన్యూ సిబ్బంది కాలనీల్లో పర్యటించి ఎర్లీబర్డ్ చెల్లింపులపై ఇంటి యజమానులకు అవగాహన కలిగిస్తున్నారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలకు హాజరవుతూ ఇంటి యజమానుల నుంచి ప్రస్తుత ఆస్తిపన్ను చెక్కులను స్వీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఆస్తిపన్ను ముందస్తు (ఎర్లీబర్డ్) చెల్లింపు పథకానికి శుక్రవారం ఆఖరు రోజు కావడంతో ప్రజలు పన్ను చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు.
ఇప్పటివరకు రూ.10.20 కోట్లు వసూలు..
- జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 30 సర్కిళ్లలో కాప్రా సర్కిల్ ఎర్లీబర్డ్ ఆస్తిపన్ను వసూళ్లలో 56.07 శాతం వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచింది.
- గత వారం రెండో స్థానంలో నిలిచిన కాప్రా .. ఈ వారం మొదటి స్థానంలోకి దూసుకెళ్లడంతో సర్కిల్ రెవెన్యూ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
- కాప్రా సర్కిల్‌కు ఈ ఏడాది (ఏప్రిల్ 2021) ఎర్లీబర్డ్ టార్గెట్ రూ.16.14కోట్లుగా నిర్ణయించగా, ఈనెల 28వ తేదీ వరకు ఈ పథకం కింద రూ.9.05 కోట్లు వసూలైనట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
- బుధవారం ఒక్కరోజే రూ.2.24కోట్లు వసూలు కాగా, ఈసీఐఎల్ నుంచి రూ.1.64కోట్ల ఆస్తిపన్ను ఇందులో ఉంది. గురువారం మధ్యాహ్నం వరకు ఎర్లీబర్డ్ చెల్లింపులు రూ.10.20 కోట్లు దాటినట్టు సర్కిల్ వర్గాలు పేర్కొన్నాయి.
- అయితే, ఎర్లీబర్డ్ చెల్లింపులకు ఇంకా ఒకరోజే మిగిలి ఉంది.
- ఆఖరు రోజు లక్ష్యాన్ని (రూ.16.14కోట్లు) చేరుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

