శ్రావణ మాసం శివపార్వతులకు చాలా ప్రీతికరమైనది…

కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్‌పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్‌లో ఉన్న శివాలయం, ఐడిపిఎల్ కంపనీ ప్రక్కన గల శివాలయం, బాలానగర్ కళ్యాణ్ నగర్లో గల భ్రమరాంభిక మల్లిఖార్జున ఆలయాలు విశిష్టమైనవి. ఇందులో అత్యంత పురాతన ఆలయం అయిన కూకట్‌పల్లిలో ఉన్నభ్రమరాంభికా మల్లిఖార్జున రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది.

శ్రీ రామ లింగేశ్వర దేవాలయాలు మొత్తం 11 ఒకేసారి ఏర్పాటు చేశారు. అందులోనిదే పాత శివాలయం కైలాసయంత్ర ప్రస్థారికంలో స్వయంత్రముగాప్రతి విగ్రహానికి యంత్రము నిర్ణయించి పూజాది విశేషాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయం 2007లో పునర్ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయ ద్వజ స్తంభం అడుగు భాగంలో దీని చరిత్ర చక్కగా చెప్పడం జరిగింది. ఇది సుమారుగా కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించిన కాలంలోనే కూకట్పల్లి మల్లిఖార్జున ఆలయం, పఠాన్ చెరువులోని రామలింగేశ్వర మల్లిఖార్జున ఆలయం ఒకే సమయమున ఒకే వైపు ముఖంతో, ఒకే రేఖపై ఏర్పాటు చేసిన ఆలయాలు అని స్థల పురాణం చెబుతుంది.
ఈ శివాలయం ప్రాంగణంలో ఉన్న మహానంది, మహాబలేశ్వరం నుంచి తీసుకుని ప్రతిష్ఠించారట. అంతే కాకుండా ఆలయ ప్రవేశ ద్వారంలో పంచాక్షరీ మహామంత్రం మహాన్యాస యంత్రంతో కూడిన ఐదు మెట్ల నిర్మాణం జరిగింది. ఆ ప్రవేశ ద్వారం ద్వారా ప్రవేశం చేసిన లేదా ద్వారా దృశ్యం చూసిన, ద్వారానికి నమస్కరించినా.. మహాన్యాస రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందని ప్రతీతి. ఈ రకమైన విశిష్టతలకు ఆలయ పూర్వ మాజీ చైర్మెన్ లోకై పటేల్ బాగా ఆలోచించి పండితుల అందరితో చర్చించి దీని పునర్నిణంలో విశేష కృషి చేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

