kcr birthday | మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 16 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (kcr birthday) జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద యాదవ్ కోరారు.
ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని కండ్లకోయలో గల సాకేత్ బూసత్వలో మొక్కలు నాటడంతోపాటు, స్థానిక కృషి ఓం అనాధ పిల్లల ఆశ్రమంలో చిన్నారులతో కేక్ కట్టింగ్, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నామని చేస్తున్నారు.
ఉదయం 10 గంటలకు నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ రావులు పాల్గొననున్నారని తెలిపారు. మేడ్చల్ మండలంలోని గ్రామాలు, గౌరవెల్లి, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్