Ghatkesar | ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని సుమారు 300కుపైగా గొర్రెలు మృతి చెందాయి. ఔషాపూర్ సమీపంలోని కేపాల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కాజీపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో పెద్ద సంఖ్యలో మృతి చెందాయి.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘట స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బాధితులను కలిసి పరామర్శించారు. పెద్ద భారీ సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో భారీగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.