ఆఖరి మజిలీకి అన్ని సౌకర్యాలు

- రాంపల్లి వైకుంఠధామం అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు
- త్వరలో పనులు ప్రారంభం
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 20: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలోని సామూహిక వైకుంఠధామానికి ప్రభుత్వం కోటి రూపాయిలు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠధామాలను నిర్మిస్తుంది. గతంలో ఎవరైన చనిపోతే దహన సంస్కారాలు చేసిన చోట నీటి సదుపాయం, స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక అంత్యక్రియలకు వచ్చిన వారు ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆఖరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వైకుంఠధామాలను ఆధునిక హంగులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాంపల్లి సామూహిక వైకుంఠధామంలో త్వరలో ఆధునిక హంగులతో పనులు మొదలు కానున్నాయి.
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
- గత ప్రభుత్వాలు వైకుంఠధామాలను పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ వైకుంఠధామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసున్నారు. రాంపల్లి వైకుంఠధామానికి కోటి నిధులు మంజూరుతో ఆధునిక హంగులతో పనులు పూర్తి చేసి నగరంలోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దుతాము. – కౌకుట్ల చంద్రారెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్.
- రాంపల్లి సామూహిక వైకుంఠధామంలో త్వరలో పనులు మొదలు పెడుతాం. ప్రహరీ నిర్మాణం, పురుషులకు, స్త్రీలకు విడివిడిగా మరుగుదొడ్లు, స్నానపు గదులు, దహనవాటిలు, లైటింగ్, బోరుమోటర్ ఏర్పాటుతో పాటు మొక్కల నాటడం తదితర పనులు చేపడుతాము. – ఏ.వాణిరెడ్డి, నాగారం మున్సిపల్ కమిషనర్.
- రాంపల్లి వైకుంఠధామం అభివృద్ధి ప్రభుత్వం కోటి రుపాయిలు నిధులు మంజూరు చేయడం సం తోషం.గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నేడు వైకుంఠధామాలను నూ తన హంగులతో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కోటి రూపాయల మంజూరు సహకరించిన చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్లకు, అధికారులకు ధన్యవాదాలు. – ఎలిజాల రాజు గౌడ్, రాంపల్లి.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

