Traffic Rules | తుర్కయంజాల్, జూన్ 27 : హెల్మెట్ వాడడం వలన కలిగే ప్రయోజనాలపై మహేశ్వరం ట్రాఫీక్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి సాగర్ రహదరిపై ట్రాఫీక్ పోలీసులు ఆవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. వాహనదారులు అందరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. అనంతరం సాగర్ రహదారిపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులను ఆపి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ట్రాఫీక్ సీఐ గురు నాయుడు, ఎస్ఐ సాయినాథ్ గౌడ్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.