బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఊరూవాడ కేక్‌లు కట్ చేసి జననేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కొందరు మొక్కలు నాటారు.
వందేండ్లు వర్ధిల్లు అంటూ సబ్బండవర్ణాలు ఆశీర్వాదించాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడెంలోని రైతు పొలం వద్ద మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ను కట్ చేసి.. శ్రేణులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన అక్కడ మొక్కను నాటారు. అలాగే, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివాజీచౌక్‌లో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర యువతకోసం కేటీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాగా, తాండూరు పట్టణంలోని నంబర్-1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ ఆధ్వర్యంలో స్మైల్ ఎట్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ