ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి
ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
పండ్ల మార్కెట్లో నూతన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కు కోసం లీజుకు మరో 18 ఎకరాలు
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 18: ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్ నిర్మాణం జరుగనున్నది.. ఢిల్లీలోని ఆజాద్‌నగర్ మార్కెట్ కంటే నాలుగింతలు పెద్దదిగా ఉంటుంది.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు..’ అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం సంఘీనగర్ రోడ్డు నుంచి అనుసంధానంగా నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యానవన పంటల వినియోగం పెరిగిందని, ఉద్యానవన సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. రెండేండ్లలోనే మార్కెట్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ లోగా రైతులు, వ్యాపారులు, ట్రేడర్స్‌కు ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో ముందుచూపుతో ప్రత్యామ్నాయంగా బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులోకి పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. అక్కడి స్థలం సరిపోదన్న వ్యాపారుల కోరిక మేరకు 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద అత్యాధునిక నూతన పండ్ల మార్కెట్‌ను కొహెడలో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ గ్రా మంలో సర్వేనంబర్ 507, 548లోని 178 ఎకరాల్లో చేపడుతున్న పండ్ల మార్కెట్‌కు సంఘీనగర్ రోడ్డు నుంచి అనుసంధానంగా రూ.50 లక్షలతో నిర్మించనున్న 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, భేతి సుభాశ్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి శుక్రవారం మంత్రు లు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఉత్పత్తి అయిన పంటలను ప్రస్తుత గిడ్డంగుల్లో నిల్వ చేసేందుకు సరిపడా స్థలం లేదని అందుకోసమే అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన పండ్ల మార్కెట్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. అందుకోసమే కొహెడలో రైతులకు తొమ్మిదిన్నర కోట్ల నష్టపరిహారం చెల్లించి 178 ఎకరాల భూమిని తీసుకున్న ట్లు.. ఇందులో నిర్మించనున్న మార్కెట్ ఢిల్లీలోని ఆజాద్‌నగర్‌లోని మార్కెట్ కంటే నాలుగింతలు పెద్దగా ఉంటుందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా కొహెడ మార్కెట్ పేరొందనుందని మంత్రులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యానవన పంటల వినియోగం బాగా పెరిగిందన్నా రు. మన రాష్ట్రంలోని భూములు, వాతావరణ పరిస్థితులు ఉద్యానవన పంటల సాగుకు చాలా అనుకూలమని తెలిపారు. అందువల్ల రైతులు ఉద్యానవన పం టల సాగుపై దృష్టి సారించాలన్నారు.
పండ్ల మార్కెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు
కార్గో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు అవుట్ రింగ్ రోడ్డు అతి సమీపంలో ఉండటంతోపాటు త్వరలో మార్కెట్ బయటి నుంచి రానున్న రీజినల్ రింగ్ రోడ్డుతో కొహెడ పండ్ల మార్కెట్ భవిష్యత్తులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతుందని మంత్రులు తెలిపారు. పూర్తిస్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణం జరుగాలంటే ముందుగా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా లేఅవుట్‌ను తయారు చేయాలని మార్కెటింగ్ శాఖను గత నెలలోనే ప్రభుత్వం ఆదేశిం చిందన్నారు. సీఎం కేసీఆర్ లేఅవుట్‌కు ఆమోదం తెలిపిన వెంటనే ఆయన చేతుల మీదుగానే నూతన మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. రెండేండ్లలోనే మార్కెట్ పనులను పూర్తి చేయాలని మార్కెటిం గ్ శాఖను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ లోగా రైతులు, వ్యాపారులు, ట్రేడర్స్‌కు ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో ముందుచూపుతో ప్రత్యామ్నాయంగా బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులోకి పండ్ల మా ర్కెట్‌ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. ఈ స్థలం సరిపోదని ట్రేడర్స్ చెప్పడంతో పక్కనే ఉన్న మరో 18 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని అక్కడ అన్ని రకాల మౌలిక వసతులను కల్పించినట్లు మంత్రులు తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గిడ్డంగుల సంస్థ నేతృత్వంలో కొహెడలో మొదటగా కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని మంత్రులు నిర్ణయించారని, త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయన్నారు.
ట్రేడర్స్‌తో చర్చించిన తర్వాతే..
పండ్ల మార్కెట్లో ట్రేడర్స్‌కు స్థలాల కేటాయింపు ప్రభుత్వ పాలసీ అని వాటిని లీజుకు ఇవ్వాలా..? శాశ్వతంగా అప్పగించాలా..? అనే అంశాన్ని చట్ట ప్రకారం నిర్ణయిస్తామని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి అన్నారు. ట్రేడర్స్‌తో చర్చించిన తర్వాతే వారి ప్రతిపాదనలు తీసుకొని నిర్మాణం జరిగేటప్పుడు లేఅవుట్లోనే స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లైసెన్స్‌దారుల్లో అనర్హులుంటే వారిని తొలగిస్తామన్నారు. దశలవారీగా పండ్ల మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. మార్కెట్ రోడ్డు మార్గం కోసం భూమిని కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా వేరే భూమిని లేదా మార్కెట్లోనే షాపులను కేటాయిస్తామన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద మోడల్ మార్కెట్‌గా..
ఆసియాలోనే అత్యాధునిక హంగులతో అతిపెద్ద మోడల్ మార్కెట్‌గా కొహెడ పండ్ల మార్కెట్ నిర్మా ణం జరుగనున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులు, వ్యాపారులు, ట్రేడర్స్‌కు అన్ని విధాలా న్యాయం చేసేందుకే కొహెడలో అన్ని వసతులతో పండ్ల మార్కెట్‌ను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. గడ్డిఅన్నారంలో 22 ఎకరాల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన పండ్ల మార్కెట్‌కు వాహనాలు రాకపోకలు సాగించాలంటే నగరం విస్తరించి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందన్నారు. కొహెడలోని 178 ఎకరాల్లో నిర్మించనున్న పండ్ల మార్కెట్ ఆసియాలోనే అతి పెద్దదన్నారు. మార్కెట్లో భూ ములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిందన్నారు. కొహెడ మార్కెట్ అందుబాటులోకి వచ్చే వరకు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కును రైతులు, వ్యాపారు లు, ట్రేడర్స్ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకుడు లక్ష్మణుడు, ఎస్ఈ రంగులక్ష్మణ్గౌడ్, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సంతోష్, డీఈఈ రవీందర్, ఆర్డీవో వెంకటాచారి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబం ధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, చిలుక నర్సింహారెడ్డి, తుర్కయాంజాల్ ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, కౌన్సిలర్లు జ్యోతి, బం డారు బాల్‌రాజు, కంబాలపల్లి ధన్‌రాజ్, పుల్లగుర్రం కీర్తనావిజయానంద్రెడ్డి, వేముల స్వాతీఅమరేందర్రెడ్డి, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, నాయకులు బలదేవరెడ్డి, బిందూరంగారెడ్డి, తిరుమలరెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మామిడి పండ్ల సీజన్‌కు కేటాయించిన స్థలం పరిశీలన
అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 18: బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన గడ్డిఅన్నా రం తాత్కాలిక పండ్ల మార్కెట్లో వచ్చే మామిడి పండ్ల సీజన్‌కోసం అదనంగా లీజుకు తీసుకున్న స్థలా న్ని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సుభాశ్రెడ్డిలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మామిడి సీజన్ కోసం చేస్తున్న ఏర్పాట్లు, స్థల మ్యాప్ వివరాలను వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయం తీసుకున్నారని, అందుకు అవసరమైన భూమిని కూడా మార్కెటింగ్ శాఖకు కేటాయించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా లేఅవుట్‌ను తయా రు చేయాలని మార్కెటింగ్ శాఖను గత నెలలోనే ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
సీఎం కేసీఆర్ లేఅవుట్‌కు ఆమోదం తెలిపిన వెంటనే ఆయన చేతుల మీదుగానే నూతన మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. వచ్చే మామిడి పండ్ల సీజన్‌కు వాహనాలు ఎక్కువ సంఖ్యలో వస్తాయని, అందుకోసం వాహనాల సంఖ్య, రద్దీని తట్టుకునేలా అదనంగా 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బాటసింగారంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతుండగానే కొహెడలో నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. వ్యాపారులు, రైతులు, ట్రేడర్స్‌కు అన్ని విధాలా వసతులు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లతశ్రీగౌరీశంకర్, టీఆర్ఎస్ మండల ప్ర ధాన కార్యదర్శి కోట వెంకట్‌రెడ్డి, లాజిస్టిక్ పార్కు మేనేజర్ గురుపాదం, నాయకులు దేవేందర్‌గౌడ్, జగదీశ్, చక్రవర్తిగౌడ్, రాంరెడ్డి, రాధాకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.