పౌష్టికాహారం.. ఆరోగ్యానికి మార్గం
పౌష్టికాహారానికి పట్టణవాసులు దూరమవుతున్నారు. అర్బన్, పెరి అర్బన్ ప్రాంతాల్లో శరీరానికి సరిపడినన్నీ పోషకాలు చేరడం లేదు.
- అర్బన్, పెరి అర్బన్ ప్రాంతాల్లో అందని పోషకాలు
- పాలు, కూరగాయలే ప్రధాన ఆహారం
సిటీబ్యూరో, మార్చి 9(నమస్తే తెలంగాణ): పౌష్టికాహారానికి పట్టణవాసులు దూరమవుతున్నారు. అర్బన్, పెరి అర్బన్ ప్రాంతాల్లో శరీరానికి సరిపడినన్నీ పోషకాలు చేరడం లేదు. పట్టణాలు, నగరవాసుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన ఇక్రిసాట్ పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు అవసరమమైన పోషకాలు చేరడం లేదని గుర్తించింది. హైదరాబాద్ నగరంతోపాటు, శివారు పట్టణ ప్రాంతాల ప్రజల ఆహార అలవాట్లు, ఆహార వైవిధ్యం, మహిళ లు, పురుషులు, కౌమార దశలో ఉన్న యువతీయువకులు తీసుకునే పోషకాలను అంచనా వేసేందుకు ఇక్రిసాట్ సంస్థ అధ్యయనం చేసింది. నగరంలోని అఫ్జల్‌గంజ్, బేగంపేట, చాంద్రాయణగుట్ట, గగన్‌పహాడ్, మాదాపూర్, టోలిచౌకి ప్రాంతాలతోపాటు, శివారులోని ఆర్సీపురం, బాచుపల్లి, గౌరారం(తిమ్మాయిగూడ), కేపీహెచ్‌బీ 7 ఫే జ్, లింగపల్లి, మల్లాపూర్, నాగోల్, పోచా రం, ప్రాంతాల్లో జనాల ఆహారపు అలవాట్లను శాంపిల్‌గా తీసుకొని అధ్యయనం చేసింది.
పాలు, కూరగాయలతోనే సర్దుకుంటున్న మహిళలు
అర్బన్, పెరి అర్బన్ ప్రాం తాల్లో ఉండే వారి ఆహార అలవాట్లను అధ్యయనం చేయగా… ఇందులో మహిళలు తీసుకొనే పోషకాహారంలో పాలు, కూరగాయలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మాంసకృత్తులు, సూక్ష్మపోషకాలు నిల్వ ఉండే డ్రై ఫ్రూట్స్, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, విటమిన్ ఏ పండ్లు, కూరగాయలు, ఇతర పండ్లను తక్కువగా తీసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా తీసుకునేవారిలో పెద్దవారు , కౌమార దశలో ఉన్న యువకులే ఉన్నారు. అలాగే మహిళలు, యువతులకు సరిపడినంత ఆహారంలో చేరడంలో లేదని గుర్తించారు. 0 నుంచి 1.2 సగటు స్కోర్‌గా విభజిం చి ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. ఇందులో పాల ఉత్పత్తులను తీసుకొనే పురుషుల స్కోర్ 0.9గా ఉండగా.. మహిళలు 0.8గా, బాలబాలికలు వరుసగా 0.8, 0.85గా ఉన్నారు. పోషకాలు మెండుగా ఉండే కోడిగుడ్లకు చాలామంది మహిళలు దూరం గా ఉంటున్నారు. గుడ్లను ఆహారంలో చేర్చుకునే మహిళల స్కోర్ 0.15లోపే ఉండగా, పురుషులకు 0.25 స్కోర్‌గా నిర్ధారించారు.
మాంసం, నట్స్ వినియోగంలో ముందు..
కోడి, మేక, చేపలతోపాటు, బాదాం, పిస్తా, కాజు లాంటి నట్స్‌ను తీసుకొనే జాబితాలో పురుషులు, బాలికలు కొంత మహిళల కంటే ముందు ఉండగా… తీసుకునే పరిమాణం కూరగాయలు, పప్పుదినుసుల కంటే తక్కువగానే తింటున్నారు. మాంసం తినే పురుషుల స్కోర్ 0.3 ఉండగా, యువతుల స్కోర్ 0.2గా ఉంది. అలా గే నట్స్ జాబితాలో యువతుల స్కోర్ 0.25 ఉండగా, పురుషుల స్కోర్ 0.18గా ఉంది. ఇందులో మహిళల స్కోర్ 0.12 లోపే ఉందని పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

