సొంతానికి వాడుకున్నారు..
మహిళా సంఘం రుణాల అవకతవకలపై బుక్కీపర్ చేతివాటం అనే వార్తకు స్పందించిన ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కార్యాలయ అధికారి ఏపీఎం సురేశ్ విచారణ చేపట్టారు. గురువారం ఆయన మోత్కూర్ గ్రామానికి చేరుకొని బాధిత శివశ్రీ మహిళా సంఘం సభ్యులతోపాటు గ్రామస్తుల సమక్షంలో విచారించగా బుక్కీపర్ కటికె మల్లేశం తన భార్య ఖాతాకు రూ. 2.50,000 మళ్లించి వాడుకున్నది నిజమేనని తేలింది.
- మహిళా సంఘం లోన్ అవకతవకలపై అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ఏపీఎం విచారణ
- డబ్బులు మళ్లించినట్లు ఒప్పుకున్న బుక్కీపర్ మల్లేశం
- ఫిబ్రవరి ఒకటిలోగా డబ్బు చెల్లిస్తానని హామీ
దోమ, జనవరి 18 : మహిళా సంఘం రుణాల అవకతవకలపై బుక్కీపర్ చేతివాటం అనే వార్తకు స్పందించిన ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కార్యాలయ అధికారి ఏపీఎం సురేశ్ విచారణ చేపట్టారు. గురువారం ఆయన మోత్కూర్ గ్రామానికి చేరుకొని బాధిత శివశ్రీ మహిళా సంఘం సభ్యులతోపాటు గ్రామస్తుల సమక్షంలో విచారించగా బుక్కీపర్ కటికె మల్లేశం తన భార్య ఖాతాకు రూ. 2.50,000 మళ్లించి వాడుకున్నది నిజమేనని తేలింది.
ఆ డబ్బు ను వడ్డీతో కలిపి చెల్లిస్తానని అధికారులు, గ్రామస్తుల సమక్షంలో అతడు ఒప్పుకున్నాడు. కాగా బాధిత మహిళా సంఘం సభ్యులకు రూ. పది వేలు రీపేమెంట్ చేయ గా .. మిగిలిన డబ్బును ఫిబ్రవరి 1లోగా సంఘం ఖాతాకు జమ చేస్తానని మల్లేశం ఒప్పుకున్నట్లు ఏపీఎం సురేశ్ తెలిపారు. గడువులోగా మిగతా డబ్బును చెల్లించకపోతే మల్లేశంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీసీ నారాయణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షు రాలు జ్యోతి, అకౌంటెంట్ మంజుల, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

