శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పెరిగిన రద్దీ
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది.
- వీడ్కోలు పలికేందుకు నలుగురికి మించి రావొద్దని పోలీసుల సూచన
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వెళ్తున్న సమయంలో వారికి వీడ్కోలు చెప్పేందుకు వందలాది మంది విమానాశ్రయానికి వస్తున్నారు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో కొంత మంది ప్రయాణికులు సమయానికి బోర్డింగ్ కాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీడ్కోలు కోసం నలుగురు మాత్రమే రావాలని అధికారులు సూచించారు. విదేశాలకు వెళ్తున్న వారి వెంట ఎక్కువ సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు రావొద్దని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. ఒక్క ప్రయాణికుడి కోసం సుమారు 10 నుంచి 15 మంది ఎయిర్‌పోర్టుకు వస్తుండటంతో భద్రతా సమస్యలతో పాటు పార్కింగ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. దీనికి తోడు పంద్రాగస్టు నేపథ్యంలో విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సీఐఎస్ఎఫ్, స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత 3, 4 రోజులుగా ఎయిర్‌పోర్టులో పెరిగిన రద్దీ నేపథ్యంలో పోలీసులు, విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ముందస్తుగా సూచనలు చేశారు. అయినా శనివారం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసింది. నిత్యం విదేశాలకు సుమారు 5వేల మంది విద్యార్థులు వెళ్తున్నారని అధికారులు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

