Ice Apple | ఐస్ యాపిల్ మస్తు పోషకాల్.. తాటిముంజలతో మండుటెండల నుంచి ఉపశమనం
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు(ఐస్ యాపిల్) ప్రత్యేకమైనవి. కల్తీలేనివి, స్వచ్ఛమైనవి కావడం వల్ల వీటిని పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు.
- తాటిముంజలతో వేసవిలో చల్లచల్లగా
- పల్లె, పట్టణాల్లో విరివిగా అందుబాటులో..
- ఆరోగ్యపరంగా ప్రయోజనాలెన్నో..
Ice Apple | వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు(ఐస్ యాపిల్) ప్రత్యేకమైనవి. కల్తీలేనివి, స్వచ్ఛమైనవి కావడం వల్ల వీటిని పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. వేసవి సెలవులకు పల్లెటూర్లకు వెళ్లేవారు కచ్చితంగా లాగిస్తారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా విరివిగా దొరుకుతున్నాయి. మండుటెండల నుంచి ఉపశమనం కలిగించడమే గాక ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతాయి.
– కులకచర్ల, మే 11
తాటిముంజలను ఇష్టపడని వారు ఉండరు. వేసవి వచ్చిందంటే తాటి ముంజల విక్రయాలు జోరందుకుంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. తాటిముంజలు శరీరంలోని చకెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. గ్రామాల నుంచి తీసుకొచ్చి వీటిని విక్రయిస్తుంటారు. పట్టణాల్లో డజను ముంజలు రూ.60 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. తాటి ముంజలు గర్భిణులకు ఔషధంలా పని చేస్తాయని వైద్యులు అంటున్నారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. వేసవిలో నాలుగు ముంజలు తింటే డీహైడ్రేషన్ నుంచి విముక్తి కలుగుతుంది. ప్రాంతాలను బట్టి కొందరు వీటిని సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుకుంటారు. ముంజలను చిన్న చిన్న ముకలుగా కోసి స్వీట్లు, లస్సీ, జ్యూస్, సలాడ్‌తో పాటు చికెన్, మటన్‌లో వేసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ బీ, ఐరన్, కాల్షియం పుషలంగా ఉన్నాయి. వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాటి ముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది. పుట్టబోయే బిడ బాగుంటుంది. సీజనల్‌గా లభించే పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిది.
ఇతర ప్రాంతాలకు తరలింపు..
కులకచర్ల మండల పరిధి నుంచి హైదరాబాద్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి, వికారాబాద్, నారాయణపేట్, కర్ణాటక రాష్ట్రంలోని సేడం, గుర్మిట్కల్ ప్రాంతాలకు తాటి ముంజలను తీసుకెళ్లి అదాయాన్ని ఆర్జిస్తున్నారు. రెండు నెలల పాటు తాటి ముంజలతో ఇంటిల్లిపాలిదికి ఉపాధి లభిస్తుంది. దీంతో వారికి పనికి పని డబ్బులకు డబ్బులు అనే విధంగా తాటిముంజల విక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోషకాలిలా..
- తాటిముంజల్లో విటమిన్ బి-7, విటమిన్-కె, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-డి, జింక్, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్ ఉంటాయి.
- వీటిలో నీటిశాతం ఎకువ ఉండడం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక నీటిశాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి.
- వీటిల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తాయి.
- వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వల్ల చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
- తాటిముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబంధ సమస్యను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
- వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరారంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటిముంజలు ఎంతో సహాయపడతాయి.
- తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

