వద్దన్నవారికి ఇల్లు.. కావాలన్నోళ్లకు మొండిచెయ్యి.!
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ పునరుజ్జీవనం- సుందరీకరణ కత్తిమీద సాములా మారుతోంది. పేదోళ్ల నివాసాలను కూల్చి..
- మూసీ బాధితులతోనే డబుల్ ఇండ్ల భర్తీకి సర్కార్ యత్నం
- స్థానిక నిరుపేదల ఆగ్రహం
- తమకు ఇండ్లు ఇవ్వరా.. అంటూ ఫైర్
- ఇండ్ల దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో..
- కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్
సిటీబ్యూరో, నవంబర్ 1 ( నమస్తే తెలంగాణ ): డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ పునరుజ్జీవనం- సుందరీకరణ కత్తిమీద సాములా మారుతోంది. పేదోళ్ల నివాసాలను కూల్చి.. వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తున్నప్పటికీ వాళ్లంతా నిరుత్సాహంగానే ఉన్నారు. తమ ఇండ్లు కూల్చడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిష్టంగానే డబుల్ ఇండ్లల్లో అడుగులు పెడుతున్నారు. సొంత ఇండ్లను లాక్కొని డబుల్ ఇల్లును కేటాయించడం.. ఉమ్మడి ఫ్యామిలీల నివాసాలకు ఉపయోగపడకపోవడంతో వాళ్లంతా సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇండ్లల్లో తిష్టవేసిన సమస్యలను సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. ఇలాంటి సందర్భంలో సొంత ఇండ్లు కోల్పోయిన వాళ్లు… డబుల్ ఇండ్లలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. బలవంతంగా వారికి ఇల్లు కేటాయించి తరలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో తమకు ఇల్లు కావాలంటూ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు అందిస్తున్నారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తుండంటంతో కలెక్టరేట్లో గృహ నిర్మాణ శాఖలో ప్రత్యేక కౌంటర్ తెరిచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇది వరకు ఇచ్చిన దరఖాస్తులే లక్షల్లో ఉన్నాయి. ఇప్పటికీ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. దీంతో అర్హులు చాలా మంది ఉన్నారని గుర్తించినప్పటికీ డబుల్ బెడ్ రూంలను స్థానికంగా ఉన్న అర్హులను కాదనీ.. మూసీ బాధితులకు కేటాయించడంపై స్థానిక ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి గందరగోళ మూసీ పరిస్థితులు రేవంత్ సర్కార్‌కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఎలాగైనా మూసీ నిర్మాణాలు కూల్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి అటు మూసీ బాధితులు, ఇటు స్థానిక జనం నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య మూసీ నిర్మాణాల కూల్చివేతలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

