భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురాలి
ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురాలని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
- కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టండి
- కేసులకు భయపడేది లేదు.. ధైర్యంగా పోరాడండి
- కష్టకాలంలో ఉన్నోళ్లనే నాయకులుగా చేసుకుందాం
- భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురాలని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలంటే ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలని కోరారు. భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 2014లో పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితోనే 2024లోనూ గెలిపించాలన్నారు. నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో భారీ విజయం మనదేనని చెప్పారు. అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు.
బలహీన వర్గాల నేత క్యామ మల్లేశ్
‘భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేశ్ బలహీన వర్గాల నేత. బీసీల కోసం ఎంతో చేశారు. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నది. వివాదరహితుడు, సౌమ్యుడు. ఆయనను పార్లమెంట్‌కు పంపాలి.’ అని హరీశ్‌రావు కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, చింతల వెంకటేశ్వరరెడ్డి, పాల్వాయి స్రవంతి రెడ్డి, సూదగాని హరిశంకర్ గౌడ్, జడల అమరేందర్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దే
– క్యామ మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతుబంధు బంద్, 24 గంటల కరెంట్ బంద్, కల్యాణలక్ష్మి బంద్, నీళ్లు బంద్ అయినై.. చివరికి కాంగ్రెస్సే బంద్ అయ్యే పరిస్థితి వస్తది. రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో కలిసి చివరకు కేంద్రంలోని మోడీతో కలిసి పోవడం ఖాయం. రేవంత్‌రెడ్డి బీజేపీతో జత కూడితే తెలంగాణ రాష్ట్రంలో ఇక అభివృద్ధి శూన్యం. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారిని చిత్తుగా ఓడించాలి. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నాకు ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తా.
కాంగ్రెస్ మోసాలు నాలుగు నెలల్లో బయటపడ్డాయి
-మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఆ పార్టీ మోసాలు, అబద్ధాలు బయటపడ్డాయి. నీళ్లు లేవు, 24 గంటల కరెంట్ లేదు. రైతు బంధు ఇవ్వలె, రుణమాఫీ చేయలె. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

