డ్రిప్ విధానం.. రైతుకు వరం
నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్‌ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.
- నీటి కొరతను అధిగమించేలా ఉపయోగం
- లాభాలు ఆర్జిస్తున్న అన్నదాతలు
- తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
చేవెళ్లటౌన్, మే 16: నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్‌ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. డ్రిప్‌ను ఏవిధంగా పదిలంగా ఉంచుకోవాలని చేవెళ్ల డివిజన్ ఉద్యానవన అధికారి అశోక్ సూచనలు, సలహాలు ఇచ్చారు.
కొత్త డ్రిప్ ప్రారంభించే ముందు జాగ్రత్తలు
కొత్త డ్రిప్ ప్రెషర్ కలగజేసేందుకు అన్ని ప్రధాన వాల్స్లను, ల్యాటర్ పైప్ చివర మూసివేయాలి. పొలంలో ఉన్న మొచిన్ వాల్స్‌ను తెరవాలి. మోటార్ ప్రారంభించిన వెంటనే ప్రెషర్ గేజ్‌ను గమనించాలి. ఎప్పుడు అదే ప్రెషర్లో నడపాలి. ఒకవేళ నీటి పంపు ద్వారా కలిగే ప్రెషర్, డ్రిప్‌కు సిఫార్స్ చేసిన ప్రెషర్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే బైపాస్ ద్వారా ఎక్కువగా నీటిని ఇతర అవసరాలకు వాడుకోవాలి. సిఫార్సు చేసిన దానికన్నా డ్రిప్‌లో ప్రెషర్ తక్కువగా ఉన్నట్లయితే పైపులు కారడం.. ఇతర వాల్వ్‌లు తెరచి ఉన్నాయేమో గమనించాలి.
పాటించాల్సిన ఇతర విషయాలు..
ప్రెషర్‌ను గమనించాలి. ప్రతి రోజూ నీరు పారకం తర్వాత ఫిల్టర్లు, ఫర్టిగేషన్ పరికరాలను కడగాలి. ల్యాటరల్ పైపులు, వాల్వ్‌లను, ప్లష్ వాల్వ్‌లను ప్రతి పంట తర్వాత గానీ, నీటి రకాన్ని బట్టి 5-10నీటి పారకాల గాని శుభ్రపరచాలి. మూడు, నాలుగు నెలలకు ఒకసారి నీటి నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షిస్తూ తగినవిధంగా ఆమ్ల, క్లోరిన్, ట్రీట్మెంట్ ఇవ్వాలి.
ప్రెషర్‌ను పరీక్షించండిలా..
డ్రిప్ విధానం, కంట్రోల్ హెడ్ వద్ద ప్రెషర్‌ను తెలుసుకోవడానికి రెండు ప్రెషర్ గేజ్‌లను అమర్చాలి. మొదటి ప్రెషర్ గేజ్ ఫిల్టర్‌ను ఇన్లెట్ వద్ద, రెండో ప్రెషర్ గేజ్ కంట్రోల్ హెడ్ అవుట్ లెట్ వద్ద అమర్చి ప్రెషర్లోని తేడాలను గమనించాలి. ఒకవేళ మొదటి ప్రెషర్లో సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువైతే ఫిల్టర్‌ను కడగాలి.
ఫిల్టర్‌ను శుభ్రపర్చడం..
ఫిల్టర్‌ను క్రమబద్ధంగా ప్రతి రోజూ శుభ్రపరచాలి. ఇలా చేస్తే ఫిల్టర్ నీటి నుంచి మురికిని వేరు చేసి డ్రిప్పర్లు మూసుకోకుండా చేస్తాయి ఫిల్టర్‌ను శుభ్రంగా కడగకపోతే మొక్కలకు తగినంత నీరు రాదు. ఇందులో నాలుగు రకాల ఫిల్టర్లు ఉంటాయి. హైడ్రో సైక్లిన్ ఫిల్టర్, స్క్రీన్ఫిల్టర్, స్టాండ్ ఫిల్టర్, డిస్క్ ఫిల్టర్ ఉంటాయి.
అధికారుల సూచనలు పాటించాలి..
రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. డ్రిప్ పరికరాలతో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అలాగే కలుపు నియంత్రించడం వలన కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. పరికరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. డ్రిప్‌తో రైతులు లాభాలు గడించొచ్చు.
– అశోక్, ఉద్యానవన అధికారి, చేవెళ్ల డివిజన్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

