ఆమనగల్లు, జూన్ 1: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అరికట్టవచ్చునని ఆమనగల్లు ఎస్సై వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి అదే గ్రామానికి చెందిన కల్లు విక్రమ్ రెడ్డి నాలుగు సీసీ కెమెరాలను పోలీసులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు, దాతలు సహకరించాలని కోరారు.