ధరణి తీసేస్తే.. దళారి రాజ్యమే
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
- ఆసిఫాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
- కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభం
- 47వేల ఎకరాల్లో గిరిజనులకు పట్టాలు పంపిణీ
- ఈ దఫానుంచే రైతుబంధు, అన్ని స్కీములు వర్తింపు
- ఆదివాసులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తాం
- ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, గ్రామ పంచాయతీకి
- రూ.10 లక్షలు రాబోయే ఎన్నికల్లోనూ మనమే గెలుస్తున్నాం
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించి, వైద్య వ్యవస్థను బాగు చేసి.. మన్యం మంచంపట్టే సమస్య లేకుండా చేశామన్నారు.

ఇప్పటికే ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేశామని, ఇక్కడి ప్రజల కోరిక మేరకు వార్దా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 కోట్లు, ఆసిఫాబాద్‌కు ఐటీఐ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నామన్నారు. నాగమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47వేల ఎకరాల భూమిపై గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తున్నామని, ఈ సీజన్ నుంచే రైతుబంధు కూడా అందిస్తున్నామని తెలిపారు.

ఆదివాసి, గిరిజన బిడ్డలపై నమోదైన కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రూ.25 కోట్లు ముఖ్యమంత్రి నిధుల నుంచి మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. 335 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి రూ.10 లక్షలు ప్రకటించారు. ప్రజలే దేవుళ్లుగా భావించి సేవ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లోనూ మనమే గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మీరు చూపించిన ప్రేమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

