మెట్రో పొడిగింపు ప్రకటనపై సంబురాలు
ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మెట్రోను హయత్‌నగర్ వరకు విస్తరణ ప్రకటన చేసినందున హర్షం వ్యక్తం చేస్తూ..
- సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
వనస్థలిపురం, జూన్ 23 : ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మెట్రోను హయత్‌నగర్ వరకు విస్తరణ ప్రకటన చేసినందున హర్షం వ్యక్తం చేస్తూ.. కాంప్లెక్స్ సెంటర్లో, బీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి ఆధ్వర్యంలో డివిజన్‌ని నందనవనం కాలనీలో, బీఆర్ఎస్ బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఎన్రెడ్డినగలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఏం కావాలో తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. పదేండ్లలో ఎల్బీనగర్ రూపురేఖలు మారిపోయాయని.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కృషితో వేల కోట్లను మంజూరు చేశారన్నారు.
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకం మెట్రో విస్తరణపై చేస్తామనడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యే ఏది అడిగినా సీఎం వెంటనే మంజూరు చేస్తున్నారన్నారు. అనితర సాధ్యమైన 118 జీవోను తీసుకురావడం మామూలు విషయం కాదన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సుధీర్‌రెడ్డిని మూడోసారి అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికారంలోకి రాగానే మొట్రో వస్తరణ ప్రారంభం అవుతుందని.. దీంతో లక్షలాది మందికి ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చాపల శ్రీనివాస్ యాదవ్, మధు గౌడ్, అబ్బగోని అజయ్ యాదవ్, రవికుమార్, రాజేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

