తాండూరు రూరల్ : కారును అతివేగంగా నడిపి, ఒకరూ మృతికి కారకుడైన డ్రైవర్ శివపూరి కరణ్ కుమార్‌కు రూ. 11,000 వేలు జరిమానా విధిస్తూ తాండూరు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి టి. స్వప్న తీర్పు ఇచ్చారని కరణ్‌కోట ఎస్సై శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం, గుంతబాసుపల్లి గ్రామం నుంచి తేదీ 11.08.2014న జైసింగ్ ఆటోలో గుంతబాసుపల్లి గ్రామానికి చెందిన ఎంకప్ప, మాల అనంతమ్మ, శ్యామలమ్మ, సుజాత, నిఖిత, సందయానగౌడ్, అంజిలప్ప తాండూరుకు వెళుతుండగా, తాండూరు వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణీస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.
అందులో ఎంకప్ప పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సాధిక్ అలీ ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ సీఐ శివశంకర్ కేసు నమోదు చేసి, చార్జీషీట్ వేశారు. కోర్టులో కేసు పై వాదోపవాదాలు జరిపిన తర్వాత తాండూరు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి స్వప్న, పీపీ రాజేశ్వర్, ముద్దాయి శివపూరి కరణ్‌కుమార్ (కారు డైవర్)కు రూ. 11,000లు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై తెలిపారు.