షాద్‌నగర్‌రూరల్, నవంబర్ 10 : కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక రాష్ట్రం మాదిరిగా తెలంగాణ కూడా అంధకారంగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ షాద్‌నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని కంసాన్పల్లి, వెలిజర్ల, మధురాపూర్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజల అభ్యున్నతికి అండగా ఉండే బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉండి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా వివరించాన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాతే తండాలు, గ్రామీణ ప్రాంతాలు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే సెగ్మెంట్‌ను మరింత ప్రగతిపథంలో ముందుంచుతానని హామీచ్చారు.
రాష్ట్రంలో.. షాద్‌నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ధన్వంతరి వైద్యుల సంఘం సభ్యులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తున్న అంజన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, నాయకులు పాల్గొన్నారు.