వికారాబాద్, మే 15 : గ్రామాల్లో మత్తు పదార్ధాల అమ్మకం నిషేధమని, బాలల సంరక్షణ బాధ్యత గ్రామాలదే అని బాలల సంక్షేమ సమితి చైర్మన్ వెంకటేశ్ అన్నారు. బుధవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో మత్తు పదార్థాల అమ్మకం, నిషేధం-బాలల సంరక్షణ బాధ్యత గ్రామానిదే అనే అంశంపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్రామంలో బడి మానేసిన పిల్లలు ఎక్కువగా ఉన్నారని, వీరంతా సోషల్ మీడియా,
టెక్నాలజీ ప్రభావంతో పిల్లలు మత్తు పదార్థాలకు, మత్తు పానీ యాలకు అలవాటు పడుతున్నారని, జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగడం బాధాకర మన్నారు . పిల్లలు వీటికి అలవాటు పడకుండా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉం డాలన్నారు. గ్రామాల్లో షాపు యజమానులు కూడా పిల్లలకు మత్తు పానీయాలను విక్రయించ రాదని సూచించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారి వీరాంజనేయులు మాట్లాడుతూ పిల్లలకు మత్తు పదార్థాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గ్రామాల్లో పిల్లలు ఎవరైనా దుర్భర పరిస్థితుల్లో కనపడితే చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా కానీ ఐసీడీఎస్ అధికారులకు గాని మాచారం ఇవ్వాలని సూచించారు. మత్తు పదార్థాలకు పిల్లలు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం అధికారి శ్రీకాంత్ , ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి , సీడబ్ల్యూసీ మెంబర్ సంగమేశ్, పంచాయతీ కార్యదర్శి ప్రసన్నకుమార్, ఐసీడీస్ సోషల్ వర్కర్ వనమాల, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.