పెద్దేముల్, జనవరి 7: గొట్లపల్లి ఆదర్శ పాఠశాలలో వరుసగా జరుగుతున్న ఘటనల్లో బాధ్యులెవరైనా వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకులు డాక్టర్ ఉషారాణి హె చ్చరించారు. శనివారం ఆమె గొట్లపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించారు. బడిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై డీఈవో రేణుకాదేవి తో కలిసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం ఆదర్శ పాఠశాలలను ప్రారంభించిందన్నారు. విద్యార్థులతో మాట్లాడగా మధ్యాహ్న భోజనంలో రాళ్లు వస్తున్నాయని, ఒకరిద్దరి ఉపాధ్యాయుల ప్రవర్తన బాలేదని, ప్రిన్సిపాల్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలేద ని చెప్పినట్లు వివరించారు. ఈ విషయాలపై విచారించి తగు చర్యలు తీసుకొంటామన్నా రు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో వండి న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగ్గా లేదని, ఆమె ను ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని అదనపు సంచాలకులు ఉషారాణికి ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో జడ్పీటీసీ ధారాసింగ్, ఆదర్శ పాఠశాలల ఏఎంవో, ఎం ఈవో వెంకటయ్య, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బాల్‌రాజ్, హన్మాపూర్ మాజీ సర్పంచ్ నర్సింహులు, నాయకులు రమేశ్, శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.