షాద్‌నగర్‌టౌన్, జూన్ 20: పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, నులిపురుగుల నివారణే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకోవడం ద్వారా రక్తహీనతను నియంత్రిస్తుందని, పోషకాలను మెరుగుపరచడంతో పాటు ఏకాగ్రత మెరుగుపరుస్తుందన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని, వారందరికీ తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలను వేయించాలన్నారు. ఈ నెల 27న మళ్లీ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ పావని నర్సింహులు, ఎంఈవో శంకర్‌రాథోడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి, ఆప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీహరి, సీడీపీవో నాగమని, హెల్త్ సూపర్వైజర్లు చంద్రకళ, శ్రీరామ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, నాయకులు బాబర్‌ఖాన్, తిరుపతిరెడ్డి, రమేశ్, గౌస్, రవి, శ్రీకాంత్, ఏఎన్ఎంలు లక్ష్మి, మంజుల, ఆశలు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : గొల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న మహాత్మాగాంధీ జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాల, తంగడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రఘుబాబు, కళాశాల అడ్మిషన్ ఇన్చార్జి, అధ్యాపకుడు మురళి, ఏఎన్ఎంలు ఎస్.మమ్మాదేవి, అనిత, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్, ఆశ వర్కర్ సుజాత, జీఎన్ఎం శిల్ప, విద్యార్థులు పాల్గొన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను జడ్పీటీసీ దశరథ్‌నాయక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, హెచ్ఎం జంగయ్య, నాయకులు నర్సింహ, అంజి, శ్రీనివాస్, శ్రీకాంత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె వెంట వైస్‌చైర్మన్ మంగ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఆమె వెంట ఎంపీటీసీలు కృష్ణ, కుమాస్వామిగౌడ్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఆదిబట్ల : ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరమేశ్ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు బాబ్లీ పాల్గొన్నారు.
మొయినాబాద్ : విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నులిపురుగుల మాత్రలను వేశారు. కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎంపీడీవో సంధ్య, ఎంపీటీసీ మల్లేశ్, వైద్యురాలు వాణి, హెల్త్ సూపర్వైజర్ సునీత పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం, ఎలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పూనం, మోహన్, ఎంపీటీసీ అనసూయ, జ్యోతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలోని అంగన్వాడీ స్కూల్లో చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలను చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీడీపీవో శోభారాణి, డాక్టర్ వేదశ్రీ, వైభవ్‌రెడ్డి, సూపర్వైజర్ శ్రీలక్ష్మి, ఏఎన్ఎం స్వర్ణలత, అంగన్వాడీ టీచర్స్ ప్రవీణ, ఉమా, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఎంపీపీ సుకన్యభాష నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, వైద్యాధికారిణి రాజ్యలక్ష్మి, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.