షాద్‌నగర్‌టౌన్, జనవరి 27: ఎరువులు కొనుగోలు చేసే రైతులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు సూచించారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపు ల్లో ఎరువు నిల్వ, రికార్డులను ఫరూఖ్‌నగర్ మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి డీలర్ రైతులకు ఆధార్‌కార్డు ఆధారిత వేలి ము ద్ర ద్వారా ఈ-పోస్ మెషిన్‌తో మాత్రమే ఎరువులను విక్రయించాలన్నారు. అవసరమైన ఎరువులను నిల్వ ఉంచుకోవాలన్నారు.