Chilukuru Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి13: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై రామరాజ్యం స్థాపన పేరుతో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి చేసిన దాడిని అహోబిలం రామానుజ జీయర్ స్వామిజీ తీవ్రంగా ఖండించారు. గురువారం చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకుని రంగరాజన్‌ను అహోబిలం రామానుజ జీయర్ స్వామిజీ పరామర్షించారు. దాడికి గల కారణాలను రంగరాజన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ స్వామిజీ వీడియో కాల్ ద్వారా అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించారు.