Aadhaar Updation | న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 14 : ఆధార్ అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. వయసు పెరుగుతున్నకొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. కాగా, ఆధార్ కార్డు వివిధ అవసరాలకు ప్రామాణికమవుతోంది. దీంతో వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుండగా, అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డులోని వ్యక్తులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. వీటని పరిషరించే క్రమంలో ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ యూఐడీఏఐ అవకాశం కల్పించింది.
గతేడాది డిసెంబర్ నుంచి మూడు మాసాల పాటు ఉచితంగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చంటూ ప్రకటించింది. అయితే కార్డుదారులు అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఆశించిన మేర మార్పులు చేసుకోలేదు. దీంతో ఈఏడాది మార్చి 14 నుంచి మరో మూడు నెలల పాటు అంటే జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల్లో కొద్దిమేర చైతన్యం రాగా, అప్డేట్ చేసుకునే వారి సంఖ్య క్రమేపి పెరిగింది.
అయితే ఈలోపు గడువు సమీపించడంతో మరో మూడు మాసాలు పెంచుతూ ఈనెల 14వరకు అవకాశం కల్పించింది. అయినా, ఇంకా పదేళ్ల గడువు ముగిసిన వారు భారీ సంఖ్యలోనే ఉండడంతో మరోసారి మార్చి 14 వరకు గడువు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిన అనంతరం అప్డేట్తో పాటు ఫొటో, నివాసం, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు విధిగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని ఆధార్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఉచితంగా ఆన్లైన్ చేసుకునే విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఉడాయ్ పోర్టల్‌లో https://myaadhaar.uidai.gov.in ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రొసీడ్ టూ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వివరాలు స్క్రీన్‌పై వస్తాయి. వాటిని పూర్తిగా పరిశీలించి, సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. కిందకు స్రోలింగ్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను సాన్ చేసి అప్లోడ్ చేయాలి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.