షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 24 : షాద్‌నగర్ పట్టణంలోని భాగ్యనగర్‌కాలనీ కృష్ణవేణి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను శనివారం నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ తాత వేషధారణతో విద్యార్థి అందరిని ఆకట్టకున్నాడు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రఫత్సుల్తానా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలోని రంగారెడ్డి నగర్ కాలనిలో చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రమేశ్, మహిళా నాయకురాలు సమతారెడ్డి, క్రైస్తవులు ఉన్నారు.
కేశంపేట : మండల కేంద్రంలోని గ్లోబల్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో క్రిస్మస్ తాత వేషంలో పాఠశాల విద్యార్థి చిన్నారులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణాచారి, ఉపాధ్యాయులు శివకుమార్, ప్రవీణ్‌కుమార్, హరిత, నాగరాణి, పావని, అనురాధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలో సెమీ క్రిస్మస్ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. చర్చీల్లో కేకులు కట్ చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దఅంబర్‌పేట సంతోష్‌నగర్ కాలనీలోని ఓలివ్ గ్రేస్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో 4వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యారెడ్డి పాల్గొన్నారు. ఐదో వార్డులోని యేసు సువార్త సంఘం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కౌన్సిలర్లు రాజేందర్, అనురాధ సురేశ్ తదితరులు కేక్‌లు కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో రమేశ్, ఫాస్టర్ జాన్ జోసెఫ్ పాల్గొన్నారు.