మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Apr 27, 2020 , 00:44:32

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • దాతల సహకారంతో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ 
  • విద్యుత్‌, వైద్య, పోలీసు శాఖల సేవలు వెలకట్టలేనివి
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆదిబట్ల: నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగల్‌పల్లిలో కౌన్సిలర్లు నారని మౌనిక సుధాకర్‌గౌడ్‌, కొప్పు కృష్ణరాజుల ఆధ్వర్యంలో 400 మంది నిరుపేదలకు ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు, వలస కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా 12కిలోల బియ్యం, నగదును అందిస్తుందన్నారు. దాతలు కూడా తమకు పేదలను ఆదుకునేందుకు తోచినంతలా సాయం చేయాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో ఆదిబట్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కొత్త ఆర్తిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కోరే కళమ్మ,  మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు మౌనిక, కృష్ణరాజు, గోపగల్ల మహేందర్‌, కమిషనర్‌ సరస్వతి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పల్లెగోపాల్‌గౌడ్‌, కొప్పు జంగయ్య, నర్సింహగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : లాక్‌డౌన్‌ సమయంలో దాతలు ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మాడ్గులలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ కార్యదర్శి సుద్దపల్లి గ్రామ సర్పంచ్‌ వై. వెంకటేశ్వర్లుగౌడ్‌ 40 మంది విద్యుత్‌ కార్మికులు, 8 మంది హోంగార్డులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాల సమయంలో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్‌ సిబ్బంది, పోలీసులు, డాక్టర్లు చేస్తున్న సేవలు మర్చిపోలేమని వారికి అందరం అండగా నిలుద్దామని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఏడీఈ రవీందర్‌, ఏఈ సాయికృష్ణ, సర్పంచ్‌లు జంగయ్య, లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ జంగయ్య, మాజీ ఎంపీటీసీ దేవయ్యగౌడ్‌, మాడ్గుల గ్రామానికి చెందిన రాజురెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్యాక్స్‌ డైరెక్టర్లు వెంకటయ్యగౌడ్‌, జంగయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.