శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 31, 2020 , 00:50:22

నేడు, రేపు బ్యాంకులు బంద్‌

నేడు, రేపు బ్యాంకులు బంద్‌

తత్యాగరాయగానసభ:బ్యాంక్‌యూనియన్స్‌ యునైటెడ్‌ ఫోరం ఏపీ,తెలంగాణ స్టేట్స్‌ యూనిట్‌ ప్రతినిధులు బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.బ్యాంకు ఉద్యోగప్రతినిధులువీరే-ఆర్‌ శ్రీరామ్‌(యునైటెడ్‌ ఫో రం ఆప్‌ బ్యాంక్‌ యానియన్స్‌,కన్వీనర్‌ ), ఆనంద్‌ఫణి(అలహాబాద్‌ బ్యాంక్‌, రాజు, సీహెచ్‌ అంజిరెడ్డి, బీ.విజయమోహన్‌, బీ.సాకయ్య, జీ.భవాని, ఏ.సాయిప్రసాద్‌, జీవీఎస్‌ ప్రసాద్‌ .జీ.వెంకన్న, ఎం.మల్లికార్జున్‌, జీఎన్‌ రాజేశ్వర్‌బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు పలుమార్లు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. తమ 12 డిమాండ్ల సాధనకోసం  ఈనెల 31, ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు బంద్‌ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు బ్యాంకు వివిధ బ్యాంకు ఉద్యోగసంఘాలనేతలు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఫారిన్‌బ్యాంకులు10వేల బ్రాంచ్‌లుఈ సమ్మెలో పాల్గొంటాయన్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ స్ట్రీట్‌  కోఠిలోనూ,ఫిబ్రవరి1శనివారం సికింద్రాబాద్‌ ప్యాట్నీ ఎస్‌బీఐ  వద్ద బ్యాంకు  ఆఫీసర్లు, ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు.


logo