రేపు ‘లైఫ్ సేవ్ కిట్ల’ పంపిణీ
గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ‘లైఫ్ సేవ్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
- హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
- లష్కర్‌గూడ గ్రామంలో సభ..
- ఏర్పాట్లను పరిశీలించిన
- ఎమ్మెల్యే రంగారెడ్డి, కలెక్టర్ శశాంక
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 12 : గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ‘లైఫ్ సేవ్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్‌గూడ గ్రామంలో రేపు జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ శశాంకతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ గీత కార్మికులకు ఏదో చేయాలనే తపనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారన్నారు. అందులో భాగంగానే ఆదివారం లష్కర్‌గూడలో గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్లను పంపిణీ చేయనున్నారని తెలిపారు.
సీఎం 2 గంటల పాటు ఇక్కడే ఉంటారన్నారు. కార్మికుల రక్షణ కోసం వచ్చిన నూతన టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. సభా ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గీత కార్మికులకు రక్షణ కవచం కిట్లను అందజేయనుందని తెలిపారు. ప్రతి ఏడాది గీత కార్మికులు కల్లుగీస్తూ ప్రమాదావశాత్తు కిందపడి అంగవైకల్యం లేదా ప్రాణాలు కోల్పుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండడానికి కార్మికులకు ఈ కిట్లు ఎంతగానో దోహదపడుతాయన్నారు.
గీత కార్మికులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ, సూపరింటెండెంట్ ఉజ్వలరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ రవీందర్దత్తు, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కరుణాకర్, వనస్థలిపురం ఏసీపీ కాశినాథ్‌రెడ్డి, సీఐ అంజిరెడ్డి, ఎక్సైజ్ సీఐ ధన్వంత్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, స్థానిక నాయకులు, గౌడ సంఘాల నాయకులు, గీత కార్మికులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

