రూ.1.28 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట, ఫిబ్రవరి 13 : తండాల అభివృద్ధికి కృషి చేస్తానని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దేవులానాయక్తండాలో ఉపాధిహామీ నిధులు రూ.ఐదు లక్షలతో, కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గంగంబాయితండాలో రూ.నాలుగు లక్షలతో, కట్టుకాల్వతండాలో రూ. నాలుగు లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పను లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో ఎమ్మెల్యే మా ట్లాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న తండాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి పాలనలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారని పేర్కొన్నారు. తండాలు గ్రామపంచాయతీలుగా మారిన తరువాత ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. తండాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మండలంలోని అన్ని గిరిజన తండాలకు తాగు నీటిని అందిస్తున్నామని, పల్లె ప్రగతి ద్వారా తండాల్లో శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తండాలకు బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలను కూడా నిర్మిస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.28 కోట్లతో సీసీ రోడ్లు మంజూరయ్యాయని వీటిలో ఎక్కువ రోడ్లను తండాలకు మంజూరు చేశామని తెలిపారు. సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయా తండాలలో పర్యటించి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణు వర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మహేం దర్, పార్టీ నాయకులు దేశ్యానాయక్, నెహ్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.