షాబాద్, ఫిబ్రవరి 13: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్సీకి గొర్రె పిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని సూచించారు. దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. గ్రామస్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క బొడ్రాయి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కావలి మల్లేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూద యాదయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోట్ల మహేందర్‌రెడ్డి, దర్శన్, కొండా రాజుగౌడ్, సురేశ్‌గౌడ్, గోపాల్, భూపాల్‌రెడ్డి, శివకుమార్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.