Komuravelli Mallanna Jatara | ఘనంగా మల్లన్న జాతర.. బండారి మయమైన కొమురవెల్లి
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో గత సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా జరిగాయి. Photos Credit : అనుమల్ల గంగాధర్, నమస్తే తెలంగాణ చీఫ్ ఫొటోగ్రాఫర్
2/18
అగ్నిగుండాలను భక్తులు దాటే కార్యక్రమం ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, పెద్దపట్నం చూసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం ధూళిదర్శనం, ఆదివారం బోనాలు, పట్నాలు, సోమవారం పెద్ద పట్నం, అగ్నిగుండాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. Photos Credit : అనుముల గంగాధర్, నమస్తే తెలంగాణ చీఫ్ ఫొటోగ్రాఫర్
3/18
ఆలయ అర్చకులు పూజలు చేసిన అనంతరం హైదరాబాద్ ఒగ్గు పూజారులు పంచవర్ణాలు రంగుల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలు కట్టెలను వరుసగా పేర్చి అగ్నిగుండంగా తయారు చేశారు.
4/18
స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకొచ్చి పూజలు చేశారు. పెద్దపట్నం, అగ్నిగుండాలను ఆలయ అర్చకులు దాటిన వెంటనే భక్తులు పట్నం, అగ్నిగుండాలను దాటి మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను దర్శించుకున్నారు.
5/18
అనంతరం ఆలయ సంప్రదాయం మేరకు శివసత్తులకు, ఘనాచార్యులకు ఆలయ ఈవో, పాలక మండలి సభ్యులు కండువా, జాకెట్ ముక్కలతో పాటు స్వామి వారి బండారిని పంపిణీ చేశారు. అంతకుముందు భక్తులు పసుపును ఒల్లంతా పులుముకోవడంతో పాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు.