సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Nov 07, 2020 , 01:29:47

కొనసాగుతున్న ధరణి రిజిస్ట్రేషన్లు

కొనసాగుతున్న ధరణి రిజిస్ట్రేషన్లు

మంథనిటౌన్‌: ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్ర క్రియ కొనసాగుతున్నది. మంథని మండలంలో శుక్రవారం ముగ్గురు రైతులు పాసు పుస్తకాలు పొందడంతో పాటు భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మంథని మండలం గుమునూరు గ్రామానికి చెందిన చిందం భూమయ్య 331/అ1 సర్వే నంబరులోని భూమిని గిఫ్ట్‌ డీడ్‌ కింద చిందం మమత పేరు మీదికి పట్టా చేసుకునేందుకు, అదే గ్రామానికి చెందిన మల్యాల నాగరాజు 178/డీ/ 2, 178/డీ/2, 177/డీ/2 అనే సర్వే నంబర్లలోని భూమిని కొమురవెల్లి కిరణ్‌కు విక్రయించగా అతడి పేరు మీద పట్టా, రిజిస్ట్రేషన్‌కు, కూచీరాజ్‌పల్లి గ్రామానికి చెందిన మాచీడి జనార్దన్‌ 148/ఆ అనే సర్వే నంబరులోని భూమిని గడిపెల్లి సరితకు విక్రయించగా ఆమె పేరు మీద పట్టా, రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వీరందరి పత్రాలను తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వేణుగోపాల్‌ పరిశీలించి, ధరణి పోర్టల్‌ ద్వారా పట్టా చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. 

ఎలిగేడు: ఎలిగేడు తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శుక్రవారం ధూళికట్టకు చెందిన కొమ్ము మల్లయ్య తన కొడుకు సాగర్‌కు 4.18 ఎకరాల భూమిని గిఫ్ట్‌డీడ్‌ చేశారు. అలాగే ఎలిగేడుకు చెందిన కూర జ్యోతి వద్ద ధూళికట్టకు చెందిన మెండె సతీశ్‌ 20 గుంటల భూమి కొన్నాడు. వారి రిజిస్ర్టేషన్లు పూర్తిచేసి పత్రాలను లబ్ధిదారులకు తహసీల్దార్‌ పద్మావతి అందజేశారు. 

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి తహసీల్‌ కార్యాలయంలో శుక్రవారం తొమ్మిది రిజిస్ట్రేషన్లు అయ్యాయని తహసీల్దార్‌ దుర్శెట్టి శ్రీనివాస్‌ తెలిపారు.

రిజిస్ట్రేషన్ల పరిశీలన..

ధర్మారం: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్లను నంది మేడారం సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి  పరిశీలించారు. కార్యాలయాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్‌ సంపత్‌ను అడిగి తెలుసుకున్నారు. సాయంపేట గ్రామానికి చెందిన కూకట్ల లక్ష్మి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో ఆమెకు తహసీల్దార్‌తో కలిసి బలరాంరెడ్డి పట్టా, పాసుబుక్కు పత్రాలను అందజేశారు. ఇక్కడ సాయంపేట ఆర్‌బీఎస్‌ కోఆర్డినేటర్‌ సింగిరెడ్డి భూపతి రెడ్డి తదితరులున్నారు.