శుక్రవారం 30 అక్టోబర్ 2020
Peddapalli - Jan 26, 2020 , 05:14:43

మిన్నంటిన సంబురం..

మిన్నంటిన సంబురం..గోదావరిఖని టౌన్‌ : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్ల ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు గెలుపొందగా, స్థానికంగా సంబురాలు మిన్నంటాయి. గెలుపొందిన అభ్యర్థుల వర్గీలు పలు వార్డుల్లో వీజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముదం శ్రీనివాస్‌ (984) విజయం సాధించగా, 2వ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బద్రి రాజు (692) ఓట్లు సాధించారు. 2వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్‌.వి రమణా రెడ్డి (755ఓట్లు) గెలుపొందగా, 2వ స్థానంలో పసుల ప్రకాశ్‌ (ఏఐఎఫ్‌బీ) 644 ఓట్లు సాధించాడు. 3వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుమ్మరి శ్రీనివాస్‌ 1040 ఓట్లతో గెలుపొందగా టీడీపీ అభ్యర్థి మేకల నారాయణ 426 ఓట్లతో రెండో స్థానం వచ్చారు. 4వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి అభిషేక్‌ రావు 1160 ఓట్లుతో గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి జూపూడి అమరేశ్వర్‌ రావు 509 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. 5వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వచర్ల కృష్ణవేణి 654 ఓట్లకో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థి వడ్లూరి రాధ 620 ఓట్లు సాధించారు. 6వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి 806 ఓట్లు సాధించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పీచర శైలజ 791 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 7వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేగోళపు రమాదేవి శ్రీనివాస్‌ 964 ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్‌ అభ్యర్థి అమ్రీన్‌ సమ్మయ్య 272 ఓట్లు పొందాడు. 8వ డివిజన్‌లో దాతు శ్రీనివాస్‌ (ఏఐఎఫ్‌బీ) 852 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ నుంచి ఊట్ల శ్రీనివాస్‌ రెడ్డి 718 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 9వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జనగామ కవిత 625 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తోకల దీప 581 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 10వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి అడ్డాల గట్టయ్య 1257 ఓట్లతో గెలుపొందగా, మేడ రాజయ్య కాంగ్రెస్‌ నుంచి 516 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 11వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పెద్దెల్లి తేజస్విని 949 ఓట్లతో గెలుంపొందగా కాసిపేట తార 800 ఓట్లతో ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 12వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నుంచి బొడ్డు రజిత 1214 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి షేక్‌ షహీన్‌ 1191 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 13వ డివిజన్‌లో ఇండిపెండెంట్‌గా రాకం శ్రీమతి 1137 ఓట్లతో విజయం సాధించగా, ఏఐఎఫ్‌బీ నుంచి చక్కల లావణ్య 1054 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 14వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నీల పద్మ 1162 ఓట్లతో  విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి మిట్టపల్లి సరోజన 668 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 15వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బదావత్‌ శంకర్‌ నాయక్‌ 756 ఓట్లతో విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి దరావత్‌ రాజేశ్‌ నాయక్‌ 476 ఓట్లుతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 16వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి మందల కిషన్‌ రెడ్డి 685 ఓట్లతో విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గౌస్‌ పాషా 447 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 17వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి సాగంటి శంకర్‌ 666 ఓట్లతో విజయం సాధించగా, బీజేపీ నుంచి మూకిరి రాజు 548 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 18వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నుంచి అంజలీ దేవి 760 ఓట్లతో విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోండ్ర మాదవి 582 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 19వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నుంచి తాల్ల అమృతమ్మ 1326 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొమ్ము నాగమ్మ 624 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 20వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కన్నూరి సతీశ్‌ కుమార్‌ 775 ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.సతీశ్‌ 690ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 21వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి ఫాతిమా 793 ఓట్లతో విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొడ్డుపల్లి సరిత 459 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 22వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కౌశిక లత 945 ఓట్లతో గెలుపొందగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇస్సంపల్లి అంజయ్య 703 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. 23వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దాసరి సావిత్రి 1518 ఓట్లతో గెలుపొందగా, కుమ్మరి శారద 1023 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. 24వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కొలిపాక సుజాత 798 ఓట్లతో విజయం సాధించగా, ఏఐఎఫ్‌బీ నుంచి కొలని కవిత 449 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 25వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నగునూరి సుమలత 617 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాగి సౌమ్య 535 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 26వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి మంచికట్ల దయాకర్‌ 641 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అడప శ్రీనివాస్‌ 544 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 27వ డివిజన్‌లో బీజేపీ నుంచి కల్వల శిరీష 683 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి ఈశ్వరమ్మ 447 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 28వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంజపురి పులేందర్‌ 815 ఓట్లుతో గెలుపొందగా, సీపీఐ అభ్యర్థి తాళ్లపల్లి మల్లయ్య 708 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 29వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మహంకాళి స్వామి 1235 ఓట్లతో విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జాలి రాజమణి 567 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 30వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బింగి అనిల్‌కుమార్‌ 1355 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి నెలకంటి రాము 1042 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 31వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అడ్డాల స్వరూప 696 ఓట్లతో గెలుపొందగా, మిట్ట విశ్వవాణి ఏఐఎఫ్‌బీ నుంచి 430 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 32వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నుంచి ఐత శివకుమార్‌ 929 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుంట సాయి 809 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 33వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొంత శ్రీనివాస్‌ 1104 ఓట్లతో గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి బండి రాము 500 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 34వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నుంచి జంజర్ల మౌనిక 1394 ఓట్లతో గెలుపొందగా, పాతపెల్లి కావ్య 1003 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 35వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాముకుంట్ల భాస్కర్‌ 1001 ఓట్లుతో గెలుపొందగా, కాంగ్రెస్‌ నుంచి గాజుల కిరణ్‌ 564 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 36వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొంతల రాజేశ్‌ 1060 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుండు రాజు 927 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. 37వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి పెంట రాజేశ్‌ 655 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి దొమ్మెటి శ్రీనివాస్‌ 626 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 38వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి జంగపల్లి సరోజన 654 ఓట్లతో గెలుపొందగా, కాంగ్రెస్‌ నుంచి మేకల స్వప్న 590 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 39వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నుంచి జెట్టి జ్యోతి 744 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోపగాని శ్యామలకు 743 ఒక్క ఓటు తేడాతో ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 40వ డివిజన్‌లో బీజేపీ పార్టీ అభ్యర్థి దుబాసి లలిత 517 ఓట్లతో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థి సరోజ 426 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 41వ డివిజన్‌లో కాంగ్రెస్‌ నుంచి గడ్డం విజయ 860 ఓట్లుతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సలిగొమ్ముల ఉమారాణి 716 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 42వ డివిజన్‌లో ఏఐఎఫ్బీ నుంచి బాలరాజ్‌కుమార్‌ 952 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కే.రాజేందర్‌ 826 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 43వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ధరణి స్వరూప 703 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ నుంచి మెతుకు స్వరూప 652 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. 44వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముస్తఫా 1125 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇనుముల శ్రీదేవి 626 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 45వ డివిజన్‌లో బీజేపీ రంగు బ్రహ్మానందచారి 1052 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి మేరుగు నరేశ్‌ 659 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 46వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాతపెల్లి లక్ష్మి 884 ఓట్లతో గెలుపొందగా, మేరుగు రాజమ్మ ఏఐఎఫ్‌బీ నుంచి 784 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 47వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నంచి మేకల సదానందం 1036 ఓట్లు సాధించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మేకల సమ్మయ్య 558 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 48వ డివిజన్‌లో బీజేపీ పార్టీ నుంచి పొన్నం విద్య 874 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి గొర్రె కొమురమ్మ  731 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 49వ డివిజన్‌లో కాంగ్రెస్‌ నుంచి సనా ఫకృద్ధీన్‌ 566 ఓట్లతో గెలుపొందగా, ఏఐఎఫ్‌బీ నుంచి బాలసాని తిరుపతి 491 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 50వ డివిజన్‌లో ఏఐఎఫ్‌బీ నుంచి మహాలక్ష్మి 1068 ఓట్లతో గెలుపొందగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలసాని పద్మ 778 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

స్వీట్ల పంపిణీ..

గోదావరిఖని : నగర పాలక సంస్థ పరిధిలోని 7వ డివిజన్‌ పరిధిలోని పవర్‌హౌస్‌ కాలనీలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఆ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన రమాదేవి విజయం సాధించగా, అనంతరం కాలనీలో రంగులు చల్లుకుంటూ పటాకలు కాలుస్తూ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఫిట్‌ సెక్రెటరీ జనగామ శ్రీనివాస్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జ్యోతినగర్‌ : రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల్లో శనివారం చేపట్టిన ఎన్నికల ఫలితాల్లో ఎన్టీపీసీ ప్రాంతంను నుంచి బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపోందడంతో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. 2వ డివిజన్‌ నుంచి ఎన్‌వీ రమణరెడ్డి, 3వ డివిజన్‌ నుంచి కుమ్మరి శ్రీనివాస్‌, 4వ డివిజన్‌ నుంచి నడిపల్లి అభిషేక్‌రావు, 5వ డివిజన్‌ నుంచి కల్వచర్ల క్రిష్ఱవేణి గెలుపోందారు. అలాగే, కాంగ్రెస్‌ పార్టీ పరఫున బరిలో నిలిచినవారిలో 23వ డివిజన్‌ నుంచి దాసరి సావిత్రి, 24వ డివిజన్‌ నుంచి కొలిపాక సుజాత కార్పొటర్లుగా గెలిచారు. దీంతో  వారి మద్దతు దారులు అభ్యర్థుల ఇంటి వద్ద మిఠాయిలు పంపిణీ చేసి సంతోశం వ్యక్తం చేశారు. 
యైటింక్లయిన్‌కాలనీ : కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో కారుకు అనుకూలంగా ఫలితాలు రావడంతో కాలనీలో గులాబీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తాలో శనివారం టీఆర్‌ఎస్‌ దాని అనుబంధ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాలనీలోని 15, 17 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవడంతో పాటు 18, 19 లో గెలిచిన ఫార్వార్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుండడంతో కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురుతుందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.